2025 TVS Sport New ES Plus Price And Features: టీవీఎస్, తన పాపులర్ కమ్యూటర్ బైక్ 'స్పోర్ట్' రేంజ్‌ను ఎక్స్‌టెండ్ చేస్తూ, కొత్త వేరియంట్ ES+ ను లాంచ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర (TVS Sport ES+ Ex-Showroom Price) 60,881 రూపాయలు. ఈ కొత్త బైక్‌లో అతి పెద్ద ఫీచర్ దాని అద్భుతమైన మైలేజ్. కంపెనీ చెప్పిన ప్రకారం 2025 TVS Sport ES Plus మోడల్ లీటర్ పెట్రోల్‌తో 65 కిలోమీటర్లకు పైగా నడుస్తుంది. పెట్రోల్ రేట్లు జేబుకు చిల్లు పెడుతున్న నేపథ్యంలో, డైలీ అప్ & డౌన్ చేసేవాళ్లకు, ఎక్కువ దూరం తిరిగేవాళ్లకు ఈ బైక్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ & స్టైల్ కోరుకునే కస్టమర్ల కోసం టీవీఎస్ స్పోర్ట్ ES+ వెర్షన్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. టీవీఎస్ స్పోర్ట్ ES+ బైక్ హీరో స్ల్పెండర్‌కు నేరుగా పోటీ ఇవ్వగలదు.
లుక్ & డిజైన్ (TVS Sport ES+ Look And Design)TVS స్పోర్ట్ ES+ డిజైన్ ప్రస్తుతం మార్కెట్ దృష్టిలో ప్రత్యేకంగా నిలిచింది. దీనిని గ్రే-రెడ్ & బ్లాక్-నియాన్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో లాంచ్ చేశారు. స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌పై పిన్‌స్ట్రిపింగ్ ఇచ్చారు. ES+ వేరియంట్‌లో మాత్రమే లభించే బ్లాక్ పిలియన్ గ్రాబ్ రైల్ దీనిని ఇతర మోడళ్ల కంటే భిన్నంగా నిలబెడుతుంది. ఇంకా... కలర్-కోడెడ్ హెడ్‌లైట్ కౌల్ & మడ్‌గార్డ్ ఈ బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఈ స్పెషాలిటీలన్నీ TVS స్పోర్ట్ ES+ ని స్టైలిష్ ఐకాన్‌గా మార్చాయి.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్ (TVS Sport ES+ Engine & Performance)ఇంజిన్ & పనితీరు గురించి చెప్పాలంటే... TVS స్పోర్ట్ ES+ 109.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పవర్ తీసుకుంటుంది. ఇది గరిష్టంగా 8.08 bhp పవర్‌ను & 8.7 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను యాడ్ చేశారు. బైక్ బరువు 112 కిలోలు & గ్రౌండ్ క్లియరెన్స్ 175 మి.మీ. బ్రేకింగ్ సిస్టమ్‌గా, ముందు & వెనుక రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌లు బిగించారు. ఈ ఫీచర్లన్నీ కలిసి, గజిబిజి ట్రాఫిక్‌లో & గుంతల రోడ్లలోనూ బైక్‌ను స్మూత్‌గా నడిపించగలవు. ఈ టూవీలర్ పంచకళ్యాణికి పోటీ ఇచ్చేలా గరిష్టంగా 90 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకారం ఈ బండి మైలేజ్ లీటర్‌కు 65 కి.మీ. కంటే ఎక్కువ. ఇంధన ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. మైలేజ్ లెక్క ప్రకారం, ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఈ బండి లెక్కలేకుండా 650 కిలోమీటర్లు ఆగకుండా పరుగులు పెట్టగలదు.
ధర & వేరియంట్లు (TVS Sport ES+ Price & Variants)తెలుగు రాష్ట్రాల్లో TVS Sport ES+ ఆన్‌రోడ్ ప్రైస్ (TVS Sport ES+ On-Road Price) 75,454 రూపాయలు. Sport Self Start (ES) - Alloy Wheels ధర 84,661 రూపాయలు & Sport Self Start (ELS) - Alloy Wheels ధర 91,310 రూపాయలు. కొంచెం ఎక్కువ ఫీచర్లు కోరుకుంటూనే బడ్జెట్‌లో బండి తీసుకోవాలనుకునే కస్టమర్లకు ES+ వేరియంట్ ఉత్తమ ఎంపిక. నగరం, డీలర్‌షిప్‌ను బట్టి ఈ రేట్లు కొద్దిగా మారవచ్చు & బండి కొనేముందు మీ దగ్గరలోని డీలర్‌షిప్ నుంచి పూర్తి వివరాలు పొందండి.