Maruti Suzuki: మారుతి సుజుకి తన నెక్సా లైనప్‌లోని బలెనో, ఇగ్నిస్, సియాజ్ వంటి ఎంపిక చేసిన మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. ఈ అన్ని మోడళ్లపై రూ.5,000 వరకు 'ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్' అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర నెక్సా మోడల్స్ అయిన గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రంటెక్స్ వంటి ప్రముఖ మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు.
మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis)
మారుతి సుజుకి ఇగ్నిస్‌కు సంబంధించిన అన్ని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌లపై రూ. 65,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. అయితే దాని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లు రూ. 60,000 వరకు ప్రయోజనాలను పొందుతున్నాయి. ఇగ్నిస్ 83 హెచ్‌పీ, 113 ఎన్ఎం అవుట్‌పుట్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno)
మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు బలెనో పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు రెండిటిపై రూ. 40,000 వరకు తగ్గింపును అందజేస్తున్నారు. అయితే దాని సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 55,000 తగ్గింపును అందిస్తోంది. బలెనో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 90 హెచ్‌పీ / 113 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ వేరియంట్లతో రానుంది. ఈ కారు పట్టణ వినియోగానికి మంచిది. అయితే మీకు ఎక్కువ మైలేజీ కావాలంటే, దీనికి సంబంధించిన సీఎన్‌జీ వేరియంట్‌ని ఎంచుకోవచ్చు. అదే 1.2 లీటర్ ఇంజన్ 78 హెచ్‌పీ, 98.5 ఎన్ఎం అవుట్‌పుట్‌లను అందించనుంది.
మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz)
మారుతి సుజుకి సియాజ్‌కు సంబంధించిన అన్ని వేరియంట్‌లు అక్టోబర్ నెలలో రూ. 53,000 వరకు ప్రయోజనాలను పొందుతున్నాయి. ఈ ఆఫర్ దాని మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్‌లపై పని చేయనుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 105 హెచ్‌పీ పవర్ ఉండనుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి కార్లతో పోటీపడుతుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial