Maruti Suzuki Fronx: మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒక ప్రీమియం కాంపాక్ట్ క్రాస్ఓవర్ కారు. ఈ కారు గత సంవత్సరం ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారు 14 నెలల్లో 1.5 లక్షల యూనిట్ల వరకు అమ్ముడు పోయింది. ఈ కారు మారుతి సుజుకి బాలెనో ఆధారంగా రూపొందించబడింది.
10 నెలల్లోనే లక్ష మార్కు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ గతేడాది ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ అయింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కారుకు సంబంధించి 1,34,735 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే సమయంలో మారుతి సుజుకి 2024 ఏప్రిల్‌లోనే 14,286 యూనిట్లను మారుతి సుజుకి విక్రయించింది. దీంతో ఫ్రాంక్స్ విక్రయాలు 1,49,021 యూనిట్లకు చేరుకున్నాయి.
ఏప్రిల్ చివరి నాటికి ఈ కారు 1.5 లక్షల యూనిట్ మార్క్ నుంచి కేవలం 979 యూనిట్ల దూరంలో ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ రోజువారీ అమ్మకాలను లెక్కిస్తే ప్రతిరోజూ 475 యూనిట్ల కంటే ఎక్కువగా అమ్ముడవుతోంది. దీని ప్రకారం మే మొదటి వారంలోనే కంపెనీ 1.5 యూనిట్ల అమ్మకాలను దాటాలి. మారుతీ సుజుకి ఫ్రాంక్స్ కేవలం 10 నెలల్లో లక్ష కార్ల మార్కును దాటడం విశేషం.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ బంపర్ సేల్
మారుతీ సుజుకి ఫ్రాంక్స్ 2023 ఏప్రిల్, జూన్ నెలల మధ్య 2024 మొదటి త్రైమాసికంలో 26,638 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో జూలై, సెప్టెంబర్ మధ్య రెండో త్రైమాసికంలో ఈ అమ్మకాలు 36,839 యూనిట్లకు పెరిగాయి. మూడో త్రైమాసికంలో అక్టోబర్, డిసెంబర్ మధ్య 30,916 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే సమయంలో నాలుగో త్రైమాసికంలో అత్యధికంగా 40,432 యూనిట్లను విక్రయించింది.
Also Read: మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ కారు లాంచ్ త్వరలో - ఏఆర్ రెహమాన్ సౌండ్ డిజైన్‌తో!
మారుతీ సుజుకి నెక్సా డీలర్‌షిప్ తరఫున 2024 ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఫ్రాంక్స్ నిలిచింది. ఈ కారు అమ్మకాల పరంగా బలెనోను కూడా అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫ్రాంక్స్‌కు సంబంధించి 14,286 యూనిట్ల విక్రయాలు జరగ్గా, 14,049 బలెనో కార్లు అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ కారులో పాడిల్ షిఫ్టర్‌తో కూడిన 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. డ్రైవర్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆటో గేర్ షిఫ్టర్ ఫీచర్ కూడా అందించారు.
ఫ్రాంక్స్‌లో 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. ఈ కారులో హెడ్ అప్ డిస్‌ప్లే ఉంది. దీంతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. కారు లోపల 360-డిగ్రీ వ్యూ కెమెరాను కూడా అమర్చారు. కారు లోపలి భాగం డ్యూయల్ టోన్ ప్లష్‌తో రానుంది.
భారతీయ మార్కెట్లో సేల్స్ విషయంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందే ఉంటుంది. బడ్జెట్ రేంజ్‌లో ఎన్నో బెస్ట్ కార్లు మారుతి సుజుకి దగ్గర ఉండటమే దీనికి కారణం. టాటా కూడా పంచ్, నెక్సాన్ వంటి కార్లతో సేల్స్‌లో దూసుకుపోతుంది. బడ్జెట్ కారు పంచ్ అయితే ఎస్‌యూవీల్లో నంబర్ వన్‌గా నిలుస్తుంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?