Mahindra BE.05 Electric SUV: మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్ట్ మ్యూల్ ఇటీవలే కనిపించింది. దీన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి కంపెనీ ప్లాన్ చేసింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా షోకేస్‌లో థార్.ఈ ప్రొడక్షన్ వెర్షన్ కూడా కనిపించింది. బీఈ బ్రాండ్ ఎస్‌యూవీ పూర్తిగా ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై ఇది ఆధారపడి ఉంటుంది. షార్ప్ డిజైన్‌ను కూడా మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో చూపించారు.
మహీంద్రా బీఈ.05 అనేది కూపే లాంటి ఎస్‌యూవీ. దీని పొడవు 4,370 మిల్లీమీటర్లు కాగా... దీని వీల్‌బేస్ 2775 మిల్లీమీటర్లుగా ఉంటుంది. కూపే లాంటి స్టైలింగ్, అనేక ఆకర్షణీయమైన వివరాలు కూడా దీని ప్రొడక్షన్ వెర్షన్‌లో ఉంటాయి.
డిజైన్, రేంజ్ ఎలా ఉంటుంది?
మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్ పెద్ద సీ-ఆకారపు డీఆర్‌ఎల్స్‌తో పెద్ద మిర్రర్‌లను కలిగి ఉంటుంది. ఇది స్ప్లిట్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, పెద్ద ఎల్ఈడీ లైట్ బార్‌ను కూడా కలిగి ఉంది. వీటిని మునుపటిలానే ఉంచారు. ఈ టెస్ట్ కారును చూస్తే ఇది చాలా పొడవుగా ఉందని, దాని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అద్భుతంగా ఉందని స్పష్టమవుతుంది.
Also Read: కొత్త పల్సర్ విడుదల చేసిన బజాజ్ - లేటెస్ట్ ఫీచర్లు, రేటు ఎంతో తెలుసా?
ప్రొడక్షన్ స్పెక్ మోడల్ వోక్స్‌వ్యాగన్ సోర్స్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌లతో సింగిల్, డ్యూయల్ మోటార్ వెర్షన్‌ల్లో అందుబాటులో ఉంటుంది. ఇది 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తారని అంచనా. దీని రేంజ్ 450 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. మొత్తంమీద మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా కూపే లాంటి డిజైన్ థీమ్‌తో కూడిన స్పోర్టీ ఎస్‌యూవీ.
ఏఆర్ రెహమాన్‌తో ఒప్పందం...
మహీంద్రా దీని విషయమై ఏఆర్ రెహమాన్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఏఆర్ రెహమాన్, ఆయన టీమ్... డ్రైవ్ మోడ్‌లు, డ్యాష్‌బోర్డ్‌తో పాటు అన్ని ఇతర ఫంక్షన్‌ల కోసం సౌండ్‌లను డెవలప్ చేస్తారు. ఈ బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది లాంచ్ కానుంది. మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ... ఎక్స్‌యూవీ400 కంటే పైన ఉండనుంది. రాబోయే టాటా కర్వ్ వంటి కార్లతో ఇది పోటీపడుతుంది. దాదాపు రూ. 20 లక్షలతో ప్రారంభం అవుతుందని అంచనా. వచ్చే ఏడాది పండుగ సీజన్‌లో దీన్ని లాంచ్ చేయాలని భావిస్తున్నారు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?