Maruti Suzuki eVX Interior: మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పోలో eVX కాన్సెప్ట్‌ను తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ప్రదర్శించింది. 2023 టోక్యో మోటార్ షోలో ఈ కాన్సెప్ట్ ప్రొడక్షన్ రెడీ ప్రివ్యూ మోడల్‌ను ప్రదర్శించనున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇది కాకుండా కొత్త తరం సుజుకి స్విఫ్ట్ కాన్సెప్ట్ కూడా ఈ మోటార్ ఈవెంట్‌లో ప్రదర్శించబడుతుంది. మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పోలో ఈవీఎక్స్ కాన్సెప్ట్ లోపలి భాగాన్ని చూపించలేదు. కానీ ఈసారి సుజుకి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్ చిత్రాలను విడుదల చేసింది.
ఎంత సైజులో ఉండనుంది?
ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ 4×4 టెక్నాలజీని ఉపయోగిస్తుందని సుజుకి ధృవీకరించింది. కొత్త సుజుకి ఈవీఎక్స్ పొడవు 4300 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1800 మిల్లీమీటర్లుగా ఉంది. దీని ఎత్తు 1600 మిల్లీమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఇది 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందుకోగలదని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.
మారుతి సుజుకి ఈవీఎక్స్ ఇంటీరియర్
కాన్సెప్ట్ మోడల్‌లా కాకుండా, మారుతి సుజుకి EVX లోపలి భాగం చాలా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. ఇది ప్రొడక్షన్ మోడల్‌లో కనిపించదు. ఇది డ్యుయల్ టోన్ ఇంటీరియర్స్‌తో వస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో ఎక్కువ భాగం లేత గోధుమ రంగులో ఉంటుంది. డాష్‌బోర్డ్ చుట్టూ ఎక్కడా ఫిజికల్ బటన్‌లు లేవు. వర్టికల్లీ అలైన్డ్ ఎయిర్ కాన్ వెంట్‌లు ఇందులో ఉన్నాయి.
2-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంది. స్టీరింగ్ వీల్ వెనుక పెద్ద టచ్‌స్క్రీన్ చూడవచ్చు. ఇది ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం ఉపయోగించవచ్చు. సెంట్రల్ కన్సోల్, గేర్‌బాక్స్ సెలెక్టర్ కొత్త నెక్సాన్ తరహాలో ఉన్నాయి.
ఫీచర్లు, రేంజ్ ఎలా ఉన్నాయి?
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో స్పోర్టీ బకెట్ సీట్లు ఉన్నాయి. ఇవి డ్యూయల్ టోన్ బ్లాక్, బీజ్ కలర్ ఆప్షన్‌లో ఉన్నాయి. ముందు, వెనుక సీట్లు సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లతో వస్తాయి. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ వివిధ సీట్ల ఎంపికతో వస్తుంది. కొత్త మోడల్‌లో ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇంకా వివరాలు వెల్లడి కాలేదు.
మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ 60 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది 550 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. 4×4 టెక్నాలజీతో అప్‌డేట్ చేసిన కాన్సెప్ట్ రేంజ్ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. లాంచ్ అయిన తర్వాత ఇది టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400తో పోటీపడుతుంది.
మరోవైపు ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ దాని ఈసీ3 మోడల్ టాప్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఈ కారు బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ ఇండియన్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక ఈవీ ఇదే. ఈ కారు కస్టమర్లలో బాగా పేరు పొందింది. అయితే సిట్రోయెన్ దీంతో సంతృప్తి చెందలేదు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారులో కొత్త టాప్ స్పెక్ ట్రిమ్‌ను కంపెనీ ఇండోనేషియాలో విడుదల చేసింది. దీనికి "షైన్" అని పేరు కూడా పెట్టారు. ఇందులో మరింత అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని కంపెనీ లభించనుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial