Maruti Suzuki Brezza vs Tata Nexon: కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ గురించి మాట్లాడినప్పుడల్లా మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్ పేర్లు కూడా వస్తాయి. ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలు. మారుతి సుజుకి బ్రెజా మెరుగైన మైలేజీకి ప్రసిద్ధి చెందింది. అయితే టాటా నెక్సాన్ బలం, సేఫ్టీ పరంగా చాలా మంచిదని భావిస్తారు. ఈ రెండు వాహనాలు రూ. 10 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. మీరు ఈ రెండు కార్లలో దేనినైనా కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇక్కడ ఈ రెండు కార్ల భద్రత, పనితీరు, మైలేజీ గురించి తెలుసుకుందాం.


మారుతి బ్రెజా ఎలా ఉంది?
మారుతి బ్రెజా (Maruti Suzuki Brezza) ఒక హైబ్రిడ్ కారు. ఈ కారు కే15సీ పెట్రోల్ + సీఎన్‌జీ (బై-ఫ్యూయల్) ఇంజిన్‌తో వస్తుంది. కాబట్టి దీనిని పెట్రోల్, సీఎన్‌జీ మోడ్‌లో రన్ చేయవచ్చు. ఈ కారులోని ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 6,000 ఆర్పీఎం వద్ద 100.6 పీఎస్ శక్తిని జనరేట్ చేస్తుంది. 4,400 ఆర్పీఎం వద్ద 136 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


సీఎన్‌జీ మోడ్‌లో, ఈ కారు 5,500 ఆర్పీఎం వద్ద 87.8 పీఎస్ శక్తిని, 4,200 ఆర్పీఎం వద్ద 121.5 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ మారుతి కారు కేజీ ఇంధనానికి 25.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


టాటా నెక్సాన్ మైలేజ్ ఎంత?
టాటా నెక్సాన్ (Tata Nexon) హైబ్రిడ్ కారు కాదు. కానీ ఈ కారు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో వస్తుంది. ఈ టాటా కారులో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 5,500 ఆర్‌పీఎం వద్ద 88.2 పీఎస్ పవర్, 1,750 నుంచి 4,000 ఆర్‌పీఎం వద్ద 170 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. టాటా నెక్సాన్ 17 నుంచి 24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి మొదలై రూ. 15.50 లక్షల వరకు ఉంటుంది. మారుతి బ్రెజా ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.34 లక్షల నుంచి మొదలవుతుంది. దాని టాప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.14 లక్షల వరకు ఉంది. టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి క్రాష్ టెస్ట్‌లలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మారుతి బ్రెజా 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. టాటా నెక్సాన్ 382 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. బ్రెజా 328 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?