ప్రస్తుతం గత ఏడాది సోలో హీరోగా పాన్ ఇండియా హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి, ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. తాజాగా వెకేషన్ నుంచి ఆయన తిరిగి రాగా, రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది.
వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ హైదరాబాద్ కు తిరిగి వస్తూ, ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ సిటీకి న్యూ ఇయర్ వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడ పిల్లలు, భార్యతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేశారు. తారక్ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం 'వార్ 2' అనే హిందీ మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. వీలైనంత త్వరగా 'వార్ 2' షూటింగు పూర్తి చేసి, నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
ఆ రెండు బడా ప్రాజెక్ట్స్ ఒకేసారి సెట్స్ పైకి...
ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు. 'వార్ 2', మూవీతో పాటు ఆయన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. అలాగే 'దేవర 2' ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అంతలోపు నెల్సన్ దిలీప్ కుమార్ అనే తమిళ డైరెక్టర్ తో ఓ సినిమాను చేయబోతున్నారు ఎన్టీఆర్. నెల్సన్ దిలీప్ కుమార్ కోలీవుడ్లో 'డాక్టర్', 'బీస్ట్', 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఆయనకు ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ప్రశాంత్ నీల్ మూవీని పూర్తి చేశాక, ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమాను షురూ చేయబోతున్నారు. అయితే ఇక్కడే రెండు బడా ప్రాజెక్ట్స్ ఒకసారి సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి.
Also Read: 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కియారా అద్వానీ డుమ్మా... ఆస్పత్రిలో ఉందా? అసలు కారణం ఏమిటంటే?
అయితే అవి రెండు ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలు మాత్రం కాదు. అందులో ఒకటి రజనీకాంత్ మూవీ కూడా ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ రజినీకాంత్ తో కలిసి 'జైలర్' మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తనను టాప్ లీగ్ డైరెక్టర్స్ లిస్టులో చేర్చిన ఈ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ 'కూలీ' మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న రజనీకాంత్ నెక్స్ట్ 'జైలర్ 2' షూటింగ్ కు షిఫ్ట్ కాబోతున్నారు.
'జైలర్ 2' ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ విధంగా ఇటు ఎన్టీఆర్ - నీల్ ప్రాజెక్ట్, అటు నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్ 2' రెండు ప్రాజెక్ట్స్ ఒకేసారి సెట్స్ పైకి వెళ్లి, దాదాపు ఒకే టైమ్ లో నిర్మాణ పనులను పూర్తి చేసుకోబోతున్నాయి. కాబట్టి ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ 2026లో మొదలయ్యే ఛాన్స్ ఉంది.