Maruti Suzuki Alto on EMI: మారుతి సుజుకి ఆల్టో కే10 దేశంలోని అత్యంత తక్కువ ధర కార్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మీరు చాలా కాలంగా ఈ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు మంచి అవకాశం అని చెప్పవచ్చు.


మారుతి సుజుకి ఆల్టో కే10పై కంపెనీ మంచి తగ్గింపును అందిస్తోంది. కాబట్టి మీరు ఆల్టోను ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచి ధరను పొందవచ్చు. ఇది కాకుండా మీరు ఈఎంఐలో ఆల్టోని కొనుగోలు చేయాలనుకుంటే, దీని కోసం మీరు డౌన్ పేమెంట్, ఫైనాన్స్ ప్లాన్ గురించి తెలుసుకోవాలి.


నవంబర్‌లో మారుతి సుజుకి ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్‌పై భారీ తగ్గింపును ప్రకటించారు. దీని సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 40 వేలు, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లపై దాదాపు రూ. 50 వేలు తగ్గింపు అందిస్తున్నారు.


ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?
మారుతి సుజుకి ఆల్టో కే10 బేస్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ఆన్ రోడ్ ధర దాదాపు రూ.4.37 లక్షలుగా ఉంది. రూ. 1.2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే వరుసగా నాలుగు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 8 వేల ఈఎంఐ చెల్లించాలి. 


మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఆల్టో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. కానీ ఇటీవల ఈ కారు అమ్మకాలు కాస్త తగ్గాయి. దీంతో కంపెనీ దీనిపై మంచి ఆఫర్లను అందిస్తుంది.



Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!


మారుతి సుజుకి ఆల్టో కే10 ఇంజిన్, ఫీచర్లు...
కంపెనీ మారుతి సుజుకి ఆల్టో కే10లో 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బీహెచ్‌పీ పవర్‌తో 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయి ఉంటుంది.


ఈ కారులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం కారు పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 25 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అదే సమయంలో ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ 33 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు.


ఇప్పుడు మారుతి సుజుకి ఆల్టో కే10 ఫీచర్ల గురించి చెప్పాలంటే... కంపెనీ ఈ కారులో ఏసీ, ఫ్రంట్ పవర్ విండో, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, యాంటీ లాక్ బ్రేకింగ్ వంటి అనేక గొప్ప ఫీచర్లను అందించింది. సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.



Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!