New Maruti Celerio: కొత్త మారుతి సెలెరియో వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు.. రూ.ఐదు లక్షలలోపే!

మారుతి సెలెరియో కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Continues below advertisement

మారుతి తన కొత్త సెలెరియో కారును మనదేశంలో లాంచ్ చేసింది. గతంలో వచ్చిన మారుతి సెలెరియో పెద్ద సక్సెస్ అయింది. ఏఎంటీ గేర్ బాక్స్‌తో వచ్చిన మొదటి `మారుతి కారు ఇదే. ఇందులో మారుతి మరిన్ని ఫీచర్లు, కొత్త టెక్నాలజీలు అందించారు. ఇప్పుడు ఈ కారు ఎలా ఉందో చూద్దాం..

Continues below advertisement

1. ఎక్స్‌టీరియర్లు
కొత్త మారుతి సెలెరియోలో లేటెస్ట్ హార్టెక్ట్ ప్లాట్‌ఫాంను అందించారు. ఈ కొత్త ప్లాట్‌ఫాం ద్వారా కారు బరువు తగ్గనుంది. దీంతోపాటు మెరుగైన మైలేజ్‌ను కూడా ఇది అందించనుంది. గతంలో ఉన్న సెలెరియో కంటే ఇది కాస్త పెద్దగా ఉంది. ఇందులో రెండు కొత్త రంగులు కూడా ఉన్నాయి. వీటి హెడ్ ల్యాంపులు కూడా పెద్దగా ఉన్నాయి. టాప్ ఎండ్ వెర్షన్లలో 15 అంగుళాల బ్లాక్ అలోయ్స్ ఉన్నాయి.

2. లోపల ఎలా ఉందంటే?
వీటి డోర్లు కొంచెం పెద్దగా తెరుచుకుంటాయి. ఇంటీరియర్ కూడా గతంలో ఉన్న సెలెరియో కంటే చాలా రిచ్‌గా, మోడర్న్‌గా ఉండనుంది. ఇందులో వర్టికల్ ఏసీ వెంట్స్, కొత్త బ్లాక్ ఇంటీరియర్ కలర్, సిల్వర్ యాక్సెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీని క్వాలిటీ, డిజైన్ కూడా ఎంతో మెరుగైంది. అయితే హార్డ్ ప్లాస్టిక్‌నే ఇందులో కూడా అందించారు. ఇది ఒక ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ అందించారు. లేటెస్ట్ స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం కూడా ఇందులో ఉంది.

ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ కూడా ఇందులో ఉన్నాయి. డ్రైవర్ సీట్‌కు హైట్ అడ్జస్ట్‌మెంట్, ఏసీ పొలెన్ ఫిల్టర్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాబ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్‌లో క్లైమెట్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది.

3. ఇంజిన్ అండ్ మైలేజ్
ఇందులో కొత్త తరం కే-సిరీస్ ఇంజిన్ అందించారు. డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ పెట్రోల్ 1.0 లీటర్ ఇంజిన్ ఇందులో ఉంది. 67 హెచ్‌పీ, 89 ఎన్ఎం టార్క్‌ను ఇందులో అందించారు. 5-స్పీడ్ మాన్యువల్, లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఇందులో అందించనున్నారు. ఇందులో ఏజీఎస్ వేరియంట్ లీటర్‌కు 26.68 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. ఇందులో జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ + ఏజీఎస్ వేరియంట్ లీటర్‌కు 26 కిలోమీటర్ల మైలేజ్‌ను, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ఎంటీ వేరియంట్లు 25.23 కిలోమీటర్ల మైలేజ్, జెడ్ఎక్స్ఐ+ఎంటీ 24.97 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనున్నాయి.

4. ధర
ఇందులో మొత్తం నాలుగు ట్రిమ్స్ ఉండనున్నాయి. అవే ఎక్స్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ+. దీని ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది బేస్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ధర. ఒకవేళ మీరు ఏఎంటీ వేరియంట్ కావాలంటే వీఎక్స్ఐ వేరియంట్ కొనాల్సిందే. మాన్యువల్ వేరియంట్ కంటే ఏఎంటీ వేరియంట్ ధర రూ.50 వేల వరకు ఎక్కువ ఉండనుంది. టాప్ ఎండ్ ఏఎంటీ వేరియంట్ ధర రూ.6.94 లక్షలుగా ఉంది. హ్యుండాయ్ శాంట్రో, నియోస్ ప్లస్, టాటా టైగోలతో ఈ కారు పోటీ పడనుంది.

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!

Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!

Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement