Mahindra XUV400: మహీంద్రా కొత్త కారును లాంచ్ చేస్తుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇది చవకైన మోడల్‌గా ఉండనుంది. ఇటీవల ఒక ప్రధాన అప్‌డేట్‌ను అందుకున్న సెగ్మెంట్ లీడర్ టాటా నెక్సాన్ ఈవీతో ఈ కారు పోటీ పడనుంది. ఎక్స్‌యూవీ300 ఈవీకి మాత్రమే కాకుండా, మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీకి కూడా ఫీచర్ అప్‌డేట్‌లను కూడా ఇస్తుంది.


2024 మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ప్రో వేరియంట్
2024 మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీకి అనేక కొత్త ఫీచర్లు జోడించబడతాయని లీక్ అయిన డాక్యుమెంట్ చూపిస్తుంది. ప్రధాన అప్‌గ్రేడ్‌లలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్‌లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు కొత్త ట్రిమ్‌లను పొందుతుంది. ఈసీ ప్రో, ఈఎల్ ప్రోలో ఉండనుంది. ప్రస్తుతం ఈసీ, ఈఎల్ ట్రిమ్‌ల్లో కొత్త ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు.


టాప్ స్పెక్ మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈఎల్ ప్రో ట్రిమ్ మహీంద్రా అడ్రెనోఎక్స్ సాఫ్ట్‌వేర్‌ ఉన్న కొత్త 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో మార్కెట్లోకి రానుంది. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌కు బదులుగా ఈఎల్ ట్రిమ్ వంటి 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను రెండో డిస్‌ప్లేగా పొందుతుంది. రెండు పెద్ద స్క్రీన్‌లకు అనుగుణంగా మహీంద్రా దాని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లో పెద్ద డిజైన్ మార్పులను కూడా చేయనుంది.


2024 మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ఫీచర్లు
కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఆల్ బ్లాక్ స్కీమ్ స్థానంలో కొత్త డ్యూయల్ టోన్ ఇంటీరియర్ స్కీమ్‌తో వస్తుంది. కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉండనుంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఇంజిన్
ఎక్స్‌యూవీ400 ఈసీ ప్రో వేరియంట్ 34.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఉండనుంది. అయితే ఈఎల్ ప్రో పెద్ద 39.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 375 కిలోమీటర్ల రేంజ్‌ను పొందుతుంది. 39.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానున్న ఈఎల్ ప్రో 456 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని పేర్కొంది. ఇది రెండు వేరియంట్‌ల్లో స్టాండర్డ్‌గా ఫాస్ట్‌గా ఛార్జింగ్ అయ్యే 7.2 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ను కూడా పొందవచ్చు. ఈ రెండు వేరియంట్లు 150 హెచ్‌పీ పవర్‌ను, 310 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో మార్కెట్లోకి రానుంది. ఇందులో డిస్క్ బ్రేక్‌లు, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, అన్ని నాలుగు చక్రాలకు మూడు డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి.


2024లో మహీంద్రా మరిన్ని కొత్త వాహనాలను కూాడా లాంచ్ చేయనుందని తెలుస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ సిరీస్ ఇప్పటికే బాగా సక్సెస్ అయింది. ఈవీ విభాగంలో ఎక్స్‌యూవీ400, ఎస్‌యూవీల్లో ఎక్స్‌యూవీ700 కార్లు మంచి సక్సెస్‌ను సాధించి సూపర్ హిట్ అయ్యాయి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!