Maruti Dominates in CNG Cars  : పెట్రో ధరలు రానురాను పెరిగిపోతుండటంతో ప్రత్యామ్నాయ ఇంధ‌నాల‌పై క‌స్ట‌మ‌ర్ల ఫోక‌స్ ప‌డింది. ఈ నేప‌థ్యంలో సీఎన్జీ బెస్ట్ ఆప్ష‌న్ గా క‌నిపిస్తోంది. కిలో సీఎన్జీలో ప‌దుల సంఖ్య‌లో మైలేజీ ఇచ్చే కార్లు అత్య‌ధికంగా ఉన్నాయి. ఈక్ర‌మంలో రానురాను సీఎన్జీ కార్ల‌మైమోజు పెరిగి పోతోంది. ఇండియాలో అత్య‌ధిక మైలేజీ ఇచ్చే టాప్ టెన్ సీఎన్జీ కార్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Continues below advertisement


మారుతి సుజుకి సెలెరియో
ధర: రూ. 6.90 లక్షలు


CNG మైలేజీ ఇచ్చే కార్ల‌లో ఇదే టాప్ లో నిలిచింది.  ఇందులో 1.0-లీటర్.. 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమ‌ర్చారు. అయితే ఔట్ స్టాండింగ్ గా.. కిలోకు 34.43 కిమీల మైలేజీని ఇస్తుంది. దీంతో సీఎన్జీ కార్లలో మైలేజీ విష‌యానికొస్తే ఈ కారుకు టాప్ ప్లేస్ ను క‌ట్ట‌బెట్టారు. సెలెరియో.. ఆల్టో K10 ,S-ప్రెస్సో మోడ‌ల్ల‌ కంటే పెద్దది అయినప్పటికీ, దాని CNG వెర్షన్ మరింత ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. 


మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
ధర: రూ. 6.69 లక్షల నుండి రూ. 7.13 లక్షలు


వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ ఇండియాలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన CNG కార్లలో ఒకటిగా నిలుస్తుంది, దీని మైలేజీ కిలోకి 34.05 కి.మీగా న‌మోదైనట్లు వివిధ గ‌ణాంకాలు చెబుతున్నాయి. వ్యాగన్ ఆర్ CNGలో కూడా 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో త‌యారు చేశారు. ఇందులో  5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుప‌రిచారు. LXi ,VXi వేరియంట్ల‌లో అందుబాటులో ఉన్న వ్యాగన్ ఆర్ CNG ధర రూ. 6.69 లక్షల నుండి ప్రారంభమై రూ. 7.13 లక్షల వరకు ఉంటుంది.


మారుతి సుజుకి ఆల్టో K10
ధర: రూ. 5.90 లక్షల నుండి రూ. 6.21 లక్షలు


అత్య‌ధిక మైలేజీ ఇచ్చే కార్ల‌లో టాప్ త్రీని మారుతి కార్లే సొంతం చేసుకున్నాయి. మూడో మోడ‌ల్ విష‌యానికొస్తే
ఆల్టో K10 CNGలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ , 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అమ‌ర్చారు. అయితే ఇది కిలో సీఎన్జీకి 33.85 కిమీ మైలేజీని అందిస్తుంది. పై రెండు మోడ‌ళ్ల‌తో పోలిస్తే, ఈ కారు ధ‌ర చాలా త‌క్కువ‌. ఆల్టో K10 CNG ధర LXi ,VXi వేరియంట్ల‌కు వ‌రుస‌గా రూ. 5.90 లక్షల నుండి రూ. 6.21 లక్షల మధ్య ఉంటుంది.


మారుతి సుజుకి డిజైర్
ధర: రూ. 8.79 లక్షల నుండి రూ. 9.89 లక్షలు
ఈ కారు కూడా మారుతికి చెందిన‌ప్ప‌టికీ, కాస్త ఖ‌రీదైన కారుగా చెప్పుకోవ‌చ్చు. ఈ CNG కారు ధర రూ. 8.79 లక్షల నుండి ప్రారంభమై రూ. 9.89 లక్షల వరకు (VXi ,ZXi వేరియంట్లు) మ‌ధ్య ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఉన్న ఏకైక సెడాన్ డిజైర్ కారు ఇదొక్క‌టే కావ‌డం విశేషం. ఇది స్విఫ్ట్ కు చెందిన‌ 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ , 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను క‌లిగి ఉంది. ఇది కిలో సీఎన్జీకి 33.73 కి.మీ మైలేజీని ఇస్తుంది. 


మారుతి సుజుకి స్విఫ్ట్
ధర: రూ. 8.20 లక్షల నుండి రూ. 9.20 లక్షలు


మారుతి సుజుకికి చెందిన ఈ కారు టాప్ -5 లో నిలిచింది. మైలేజీ విష‌యానికొస్తే ఈ కారు కూడా మంచి ఔట్ పుట్ ను ఇస్తుంది. స్విఫ్ట్ CNG ధర రూ. 8.20 లక్షల నుండి ప్రారంభమై రూ. 9.20 లక్షల వరకు ఉంటుంది . ఇది VXi, VXi 0 ,ZXi వేరియంట్ల‌లో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్,  3-సిలిండర్ Z12 పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది.  ఇది కిలో సీఎన్జీకి  32.85 కిమీ మైలేజీని అందిస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఇక ఈ జాబితాలో మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో, మారుతి సుజుకి బాలెనో, ట‌యోటా గ్లాంజా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, ట‌యోట్ టైస‌ర్, హ్యుంద‌య్ ఎక్స్ ట‌ర్, టాటా పంచ్ మిగ‌తా స్థానాలను ద‌క్కించుకున్నాయి.