Jagadhatri Serial Today Episode మంత్రసాని నిషిక, యువరాజ్‌లను కిడ్నాప్ చేస్తుంది. వైజయంతి చాలా ఏడుస్తుంది. యువరాజ్, నిషి కనిపించకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఫోన్ పని చేయడం లేదు.. పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్లారో ఏంటో ఎవరూ పట్టించుకోవడం లేదని కౌషికి, సుధాకర్‌లతో చెప్పి ఏడుస్తుంది.
కౌషికి జగద్ధాత్రికి కాల్ చేసి చెప్తానని అంటుంది. యువరాజ్, నిషిలు ఉదయం నుంచి కనిపించడం లేదని పిన్ని చాలా కంగారు పడుతున్నారని కౌషికి చెప్తుంది. మేం చూసుకుంటా సాయంత్రంలోపు వస్తారులే అని జగద్ధాత్రి అంటుంది. ఇక జగద్ధాత్రి, కేథార్‌లు ఆ కిడ్నాప్ అయింది యువరాజ్, నిషికలేనా అనుకుంటారు. మరోవైపు యువరాజ్, నిషికల్ని మంత్రసాని కట్టేసుంటుంది. యువరాజ్ ఆమెతో మేం ఎవరో తెలీక మమల్ని కట్టేశావ్ మర్యాదగా చెప్తున్నా మమల్ని వదిలేయ్ అని అంటాడు.
మంత్రసాని యువరాజ్‌తో వదిలేస్తా మా డాక్టర్ వచ్చి మీ రక్తం పరీక్షించి మీ కిడ్నీలు మాకు ఉపయోగ పడతాయి అని చెప్తే కేవలం మీ కిడ్నీలు తీసుకొని వదిలేస్తా.. లేదంటే మీ ప్రాణాలు తీసుకొని వదిలేస్తా అంటుంది. నిషిక చాలా భయపడుతుంది. నా వెనక మా భాయ్ ఉన్నాడు అని యువరాజ్ అంటాడు. భాయ్ అయితే ఏంటి అని మంత్రసాని అంటుంది. ఇంతలో ఆమెకు మీనన్ కాల్ చేస్తాడు. 20 కిడ్నీలు కావాలి అని చెప్పాను కదా ఏమైంది అని అంటే ప్రస్తుతానికి ఎనిమిది మంది ఉన్నారు.. నా దగ్గరే 2 ఉన్నారు.. వాళ్ల బ్లడ్ మ్యాచ్ అయితే పంపిస్తానని అంటుంది. నిషిక చాలా భయపడుతుంది. మనం చనిపోతామా యువరాజ్ అని అంటే యువరాజ్ నా భార్యని వదిలేయ్ కావాలి అంటే నన్ను ఏమైనా చేయమని అంటాడు. ఇద్దరినీ కలిపి చంపేస్తా అంటుంది.
డాక్టర్ వచ్చి ఇద్దరి బ్లడ్ సాంపిల్స్ తీసుకుంటాడు. నిషి యువరాజ్‌ని వదిలేయమని బతిమాలితే యువరాజ్ నిషిని వదిలేయమని అంటాడు. నిషి యువరాజ్‌తో బతికితే ఇద్దరం కలిసి బతుకుదాం.. చస్తే ఇద్దరం కలిసి చద్దాం అని అంటుంది. కౌషికి బాధ చూడలేక సుధాకర్ గుడికి వెళ్దామని అంటాడు. కౌషికి వద్దని అనేస్తుంది. జేడీ, కేడీలు రౌడీల గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. మంత్రసాని రౌడీలతో కలిసి కళ్లు తాగుతూ ఉంటుంది.
యువరాజ్ తమ మందు ఓ బ్లేడ్ చూసి నిషికి అందుకోమని చెప్తాడు. నిషి కాళ్లతో అందుకుంటుంది. యువరాజ్ తన తాడు కట్ చేస్తుంటాడు. ఇంతలో డాక్టర్ ఇచ్చి ఇద్దరి సాంపిల్స్ మ్యాచ్ అయ్యావని అంటాడు. దాంతో ఇద్దరినీ చంపేసి కిడ్నీలు కొట్టేయాలి అనుకుంటారు. ఇద్దరి కిడ్నీలు తీసేసి ఉరి వేసేయమని రౌడీలతో చెప్తుంది. జేడీ, కేడీలు యువరాజ్ వాళ్లని తీసుకెళ్లిన వైపు వస్తుంటారు. ఇక యువరాజ్ తాడు కట్ చేసి రౌడీలను చితక్కొడతాడు. నిషిక కట్లు కూడా విప్పి నిషికను వెళ్లిపోమని అంటాడు. ఇంతలో మంత్రసాని యువరాజ్ తల మీద బలంగా కొడుతుంది. యువరాజ్ తలకి బలమైన గాయం అయి పడిపోతాడు. తర్వాత నిషికను కూడా కొట్టేస్తారు. ఇద్దరూ చనిపోయారని రౌడీలు మంత్రసానితో చెప్తారు. విషయం భాయ్‌కి చెప్పాలని మంత్రసాని వాళ్లు వెళ్తారు.
నిషికకు మెలకువ వస్తుంది. యువరాజ్‌ని లేపుతుంది. లేవకపోవడంతో చాలా కంగారు పడుతుంది. అక్కడే ఒక ఫోన్ కనిపించడంతో జగద్ధాత్రికి కాల్ చేసి అక్క అక్క అని ఏడుస్తుంది. కంగారు పడకుండా జరిగింది చెప్పు అని జగద్ధాత్రి అడిగితే మొత్తం చెప్తుంది. యువరాజ్ కండీషన్ కూడా చెప్పి ఏడుస్తుంది. ఏం కాదని చెప్పి జగద్ధాత్రి ధైర్యం చెప్తుంది. ఆ నెంబరు కేథార్‌కి చెప్పి లొకేషన్ ట్రేస్ చేయించమని అంటుంది. నిషిక మాట్లాడుతుంటే మంత్రసాని వచ్చి ఫోన్ తీసుకొని ఆపేస్తుంది. విషయం మొత్తం మీనన్‌కి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.