Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పాస్‌వర్డ్ ప్రకాశ్ స్పై కెమెరా పెట్టి కనుక్కుంటాడు. లక్ష్మీ, చారుకేశవ హడావుడిగా ఎలక్షన్ కోసం బయల్దేరుతారు. అంబిక చూసి లక్ష్మీని తిరిగి రాకుండా చేస్తానని అనుకొని వెనకాలే ఫాలో అవుతుంది. మధ్యలో లక్ష్మీ వాళ్ల కారు ఆగిపోవడంతో ఆటోలో బయల్దేరుతారు. 

అంబిక చూసి ఎలా అయినా లక్ష్మీ వాళ్లని వెళ్లకుండా ఆపాలని అనుకొని ఫాలో అవుతుంది. ఓ చోట ఆటో ఆపి అందులో చూసే సరికి లక్ష్మీ, చారుకేశవ ఉండరు. లక్ష్మీ లాంటి చీర కట్టుకొని మరో ఆవిడ ఉంటుంది. అది చూసి అంబిక బిత్తరపోతుంది. అంబిక వెంటనే రత్నబాబుకి కాల్ చేసి లక్ష్మీ మిస్ అయిందని అంటుంది. దాంతో రత్నబాబు చెప్పిన పని సరిగా చేయలేని నువ్వు అన్‌ఫిట్ నీ వల్ల ఏం పని కాదు అంటాడు. సరే నేను చూస్తా నువ్వు ఎలా చేస్తావో అని అంటుంది. లక్ష్మీ ని అడ్డుకోకపోతే నువ్వు గెలవవని అంటుంది. రత్నబాబు తన మనుషులతో లక్ష్మీని అడ్డుకొని పెన్‌డ్రైవ్ తీసుకురమ్మని చెప్తాడు.

రత్నబాబు, విహారిలు ఎలక్షన్ దగ్గర ఉంటారు. ఎలక్షన్ జరుగుతుంది. మరోవైపు లక్ష్మీ, చారుకేశవని రత్నబాబు మనుషులు అడ్డుకొని పెన్‌డ్రైవ్ ఇవ్వమని అంటారు. దాంతో చారుకేశవ, లక్ష్మీ ఇద్దరూ రౌడీలను చితక్కొడతారు. ఓ రౌడీ లక్ష్మీని కొట్టడంతో పెన్‌డ్రైవ్ కింద పడిపోతుంది. ఓ రౌడీ దాన్ని జేబులో పెట్టుకుంటాడు. రత్నబాబుకి ఫోన్ చేసి విషయం చెప్తారు. రత్నబాబు హ్యాపీగా ఫీలవుతాడు. సిల్క్ కోపరేటివ్ బోర్డ్ ఎలక్షన్ జరుగుతున్న దగ్గరకు లక్ష్మీ, చారుకేశవ వచ్చేస్తారు. ఇంత లేటు ఏంటి విహారి అడిగితే మధ్యలో రత్నబాబు మనుషులు ఆపేశారని చెప్తారు. ఇక ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయిపోతుంది.  

ఎలక్షన్‌లో రత్నబాబు గెలిచినట్లు ప్రకటిస్తారు. రత్నబాబు విహారితో నాతో ఏదో ఛాలెంజ్‌లు చేశావ్ ఏమైంది అని అంటాడు. గెలుపు మారిపోతుందని లక్ష్మీ అంటుంది. ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఇంకేం చేస్తావని రత్నబాబు అంటాడు. నువ్వు చేసిన తప్పులే నిన్ను పట్టిస్తాయని లక్ష్మీ అంటుంది. ఏం ఆధారం ఉంది నీ దగ్గర అని రత్నబాబు అడుగుతాడు. దాంతో లక్ష్మీ పెన్‌డ్రైవ్ కోసం బ్యాగ్‌లో వెతుకుతుంది. రత్నబాబు పెన్‌ డ్రైవ్ చూపించి దీని కోసమే వెతుకుతున్నావా అని అడుగుతాడు. చారుకేశవ, లక్ష్మీ షాక్అయిపోతారు. ఇక అధికారులు రత్నబాబుకి అధికారం ఇచ్చే టైంకి పోలీసులు వస్తారు. పోలీసులు రత్నబాబుని అరెస్ట్ చేస్తామని అంటారు. 

రత్నబాబు షాక్ అయిపోతాడు. లక్ష్మీ రత్నబాబుతో నీకు ఇలాంటి చావు తెలివి తేటలు ఉన్నాయని తెలిసే వీడియో సేఫ్‌గా దాచాను.. నీ మనుషులు రాగానే పోలీసులకు చెప్పానని అంటుంది. వీడియో పోలీసులకు చూపిస్తుంది. పోలీసులు సాక్ష్యాలు అన్నీ చూసి రత్నబాబుని అరెస్ట్ చేస్తారు. రత్నబాబు లక్ష్మీని చూసి నన్నే అరెస్ట్ చేయిస్తావా నిన్ను వదలను అని వార్నింగ్ ఇస్తాడు. ఇక రత్నబాబు పదవి ఓటింగ్ క్యాన్సిల్ చేసి తర్వాత ప్లేస్‌లో ఉన్న విహారికి అధ్యక్ష పదవి వస్తుంది. విహారి అందరితో నేను మిమల్ని బాగా చూసుకుంటా నేను అందుబాటులో లేకపోతే లక్ష్మీ చూసుకుంటుందని అంటాడు. అందరూ విహారి, లక్ష్మీలకు జేజేలు కొడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.