KTM 250 Duke Updated: కేటీయం 250 డ్యూక్‌కు సంబంధించిన కొత్త ఎడిషన్ భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ కేటీయం బైక్‌లో కొత్త టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంది. దీంతో పాటు కొత్త ఎడిషన్ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లే కాకుండా ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లను కూడా అమర్చారు. 390 డ్యూక్ తరహాలో ఉండే ఫీచర్లు ఈ బైక్‌లో అందించారు. ఈ కొత్త 250 డ్యూక్ ధర రూ.2.41 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఎక్స్ షోరూం ధర.


కేటీయం కొత్త బైక్‌లో ప్రత్యేకత ఏమిటి?
ఈ కేటీయం బైక్‌లో అమర్చిన కొత్త హెడ్‌ల్యాంప్ రాత్రిపూట మంచి కాంతిని అందిస్తుంది. ఈ బైక్‌లో ఇంతకుముందు ఎల్సీడీ స్క్రీన్ ఉంది, దాని స్థానంలో కొత్త రంగుల యూనిట్ వచ్చింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా హెడ్‌సెట్, మొబైల్ ఫోన్‌ని కనెక్ట్ చేయవచ్చు. లెఫ్ట్ హ్యాండిల్ బార్‌పై అమర్చిన స్విచ్ క్యూబ్‌లతో దీన్ని కంట్రోల్ చేయవచ్చు. కొత్త స్క్రీన్, కొత్త హెడ్‌ల్యాంప్‌లను అందించడం మినహా ఈ బైక్‌లో ఇతర మార్పులు చేయలేదు.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


కేటీయం 250 డ్యూక్ పవర్
కేటీయం 250 డ్యూక్ కొత్త మోడల్ పవర్‌ట్రెయిన్‌లో కూడా ఎటువంటి మార్పు చేయలేదు. ఈ బైక్‌లో 249.07 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 9,250 ఆర్పీఎం వద్ద 30.57 బీహెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 25 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఇంజన్‌తో పాటు 6 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది. ఇందులో బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా అందించారు.


ఈ కేటీయం బైక్ ముందు చక్రం 320 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. వెనుక చక్రం ఫ్లోటింగ్ కాలిపర్‌తో 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. బైక్‌లో సూపర్‌మోటో మోడ్‌తో కూడిన డ్యూయల్ ఛానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. ఈ బైక్ అప్‌డేటెడ్ వెర్షన్ కూడా మునుపటి మోడల్ లాగానే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?