Tata Curvv EV Real World Review: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ వాహనాలకు డిమాండ్‌తో పాటు ఈవీల రేంజ్‌లో కూడా పెరుగుదలను చూడవచ్చు. ఎలక్ట్రిక్ కారు కొనుగోలుతో పాటు వాహనం రేంజ్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో మెరుగైన రేంజ్‌ని ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా భారతీయ మార్కెట్లోకి చేర్చబడుతున్నాయి.


టాటా మోటార్స్ ఇటీవల భారతీయ మార్కెట్లో కర్వ్ ఈవీని విడుదల చేసింది. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు 502 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ కారు ఆన్ రోడ్‌లో ఎలాంటి పవర్, రేంజ్ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


టాటా కర్వ్ ఈవీ ధర ఎంత?
టాటా కర్వ్ ఈవీ టాప్ ఎండ్ వెర్షన్ 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 502 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ కారులో 45 కేడబ్ల్యూహెచ్ చిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు 430 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ అంటోంది. టాటా కర్వ్ ఈవీ టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 25 లక్షల రేంజ్‌లో ఉంది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


టాటా కర్వ్ ఈవీ వాస్తవానికి ఎంత రేంజ్ ఇస్తుంది?
టాటా కర్వ్ ఈవీని దాదాపు ఒక వారం పాటు టెస్ట్ చేసిన మీదట ఈ కారు 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మంచి రేంజ్‌ని అందిస్తుందని చెప్పవచ్చు. రూ. 25 లక్షల విభాగంలో ఉన్న కార్లలో ఇది మంచి రేంజ్‌నే అందిస్తుంది. ఈ కారు రేంజ్‌ను ఎకో, సిటీ, స్పోర్ట్... ఇలా మోడ్‌లలో పరీక్షించారు. టాటా కర్వ్ ఈవీ ఎకో మోడ్‌లో 360 నుంచి 380 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. అలాగే గరిష్టంగా 400 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది.


టాటా కర్వ్ ఈవీని... టాటా నెక్సాన్ ఈవీ లేదా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోల్చినట్లయితే... ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో మెరుగైన రేంజ్‌ని అందిస్తోంది. 400 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది కాబట్టి సింగిల్ ఛార్జ్‌తో అలా లాంగ్ డ్రైవ్‌కు కూడా వెళ్లి రావచ్చన్న మాట.


టాటా కర్వ్ ఈవీ – పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
 టాటా కర్వ్ ఈవీని అన్ని మోడ్‌లలో, వివిధ రకాల రోడ్లపై నడపడం ద్వారా టెస్ట్ చేశారు. సిటీలో ఎకో మోడ్‌లో డ్రైవ్ చేసినప్పుడు ఈ టాటా కారు అత్యుత్తమ రేంజ్‌ని అందించింది. టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 186 మిల్లీమీటర్లుగా ఉండటం విశేషం. కానీ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో పోలిస్తే తక్కువ అనే చెప్పాలి.


రూ. 25 లక్షల లోపు బెస్ట్ రేంజ్ ఇస్తుందా?
మీరు అధిక వేగంతో డ్రైవింగ్ చేసేలా అయితే సిటీ మోడ్‌లో డ్రైవ్ చేయండి. ఎందుకంటే స్పోర్ట్ మోడ్‌లో కారు వేగం చాలా పెరుగుతుంది. ఈ కారులో డిఫాల్ట్‌గా సిటీ మోడ్‌లో ఉంటుంది. టాటా కర్వ్ ఈవీ కూడా మెరుగైన పవర్‌ను, పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. మీరు రూ. 25 లక్షల రేంజ్‌లో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే టాటా కర్వ్ ఈవీ మీకు అత్యుత్తమ రేంజ్‌ను అందించగలదు.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?