Kia Carnival 2024 on EMI: ఈ సంవత్సరం ప్రారంభించిన కొత్త తరం కియా కార్నివాల్ ప్రీమియం లాంచ్ అయిన వెంటనే ప్రజలలో చాలా ప్రజాదరణ పొందింది. అయితే ఈ కారు ధర చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా బాగా డబ్బులు ఉన్నవారు మాత్రమే ఈ కారును కొనుగోలు చేయగలుగుతారు. మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే ఎంత డౌన్ పేమెంట్, ఈఎంఐ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్‌లో, కొత్త కియా కార్నివాల్ లిమోసిన్ ప్లస్ ఒకే ఒక వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.63.9 లక్షలుగా ఉంది. దీని ఆన్ రోడ్ ధర గురించి మాట్లాడుకుంటే దాదాపు రూ.76 లక్షల వరకు ఉండవచ్చు.
Also Read: ప్రతి నెలా లక్షల్లో అమ్ముడుపోతున్న బైక్‌లు - ఇండియాలో టాప్-5 కంపెనీలు ఇవే!
రూ.11.72 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారును కొనుగోలు చేస్తున్నట్లయితే మీరు బ్యాంకు నుంచి రూ.63.88 లక్షల రుణం తీసుకోవాలి. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీరు ప్రతి నెలా కనీసం రూ. 1.29 లక్షల ఈఎంఐ చెల్లించాలి. మీ లోన్ మొత్తంపై ఎనిమిది శాతం వడ్డీ రేటు వర్తించినప్పుడు ఇంత ఈఎంఐ వస్తుంది.
మీరు మొత్తం ఐదు సంవత్సరాలలో మొత్తం 15.69 లక్షల వడ్డీని బ్యాంకుకు చెల్లించాలి. రుణం తీసుకున్న తర్వాత మొత్తం రూ.83.61 లక్షలు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే రుణం, వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. కియా కారు రేటు ఎంత ఉన్నప్పటికీ మంచి సక్సెస్ కావడం చెప్పుకోదగ్గ విషయం.
Also Read: మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!