Kawasaki Ninja ZX 4RR Price: విదేశీ వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లోకి కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర దాదాపు రూ.10 లక్షలుగా ఉంది. అదే కవాసకి నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్. ఈ బైక్ కొత్త కలర్ స్కీమ్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ బైక్‌ను లైమ్ గ్రీన్, ఎబోనీ, బ్లిజార్డ్ వైట్ కలర్స్‌లో మార్కెట్లో లాంచ్ చేశారు. కొత్త కలర్ స్కీమ్‌ను అందించడమే కాకుండా కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌లో ఇతర పెద్ద మార్పులు చేయలేదు. ఈ బైక్ పూర్తిగా విదేశాల్లో తయారైంది.


కవాసకి బైక్ ఇంజిన్ ఎలా ఉంది?
కవాసకి నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్ 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్ లైన్ 4 సిలిండర్ ఇంజన్ ద్వారా పవర్‌ని పొందుతుంది. ఈ బైక్‌లోని ఇంజన్ 14,500 ఆర్పీఎం వద్ద 76 బీహెచ్‌పీ పవర్, 13,000 ఆర్పీఎం వద్ద 37.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లోని మరింత శక్తివంతమైన ఇంజన్ రివల్యూషన్‌ను 15,000 ఆర్పీఎంకి పెంచుతుంది. పవర్ అవుట్‌పుట్‌ను ఏకంగా 80 బీహెచ్‌పీకి తీసుకువెళుతుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్‌తో పెయిర్ అయింది.



Also Read: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!


నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ ఫీచర్లు
ఈ కవాసకి బైక్ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న అత్యుత్తమ మోడళ్లలో ఒకటి. ఈ మోటార్‌సైకిల్ కాంపాక్ట్ డిజైన్, మెరుగైన పవర్‌తో వస్తుంది. ఈ బైక్‌లో 4.3 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించారు. కవాసకి బైక్‌లో నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు బైక్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించారు.


మెరుగైన టెక్నాలజీ కూడా...
ఈ కవాసకి బైక్‌లో ఎలక్ట్రానిక్ థొరెటల్ వాల్వ్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, ఎకనామిక్ రైడింగ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఛాసిస్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హారిజంటల్ బ్యాక్-లైన్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. ఈ బైక్ పవర్, టెక్నాలజీ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర బైక్‌ల కంటే భిన్నంగా ఉంటుంది.


కవాసకి బైక్ ధర ఎంత?
కవాసకి నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్ మోడల్‌లో ముందు భాగంలో 290 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో 220 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ ధర రూ.9.42 లక్షలకు చేరుకుంది. దీని మునుపటి మోడల్ ధర రూ.9.10 లక్షలుగా ఉంది. మూడు కొత్త కలర్ వేరియంట్‌లను ప్రవేశపెట్టడంతో పాటు, కంపెనీ ఈ బైక్ ధరను రూ.32 వేలు పెంచింది.


ప్రస్తుతం మనదేశంలో హైఎండ్ బైక్‌లకు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మోటో వ్లాగింగ్‌పై యూత్‌కు క్రమంగా ఆసక్తి కలుగుతోంది. ఇదే ప్రీమియం బైక్‌ల సేల్స్ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో నివసించే యువత కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి అయినా సరే ప్రీమియం బైక్‌లు కొనాలని చూస్తున్నారు. దీంతో వీటి సేల్స్ పెరుగుతున్నాయి.



Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!