Hyundai Exter Bookings: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ కోసం బుకింగ్‌లు ఎప్పుడో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కారు 50,000 బుకింగ్‌ల మార్కును దాటినట్లు కంపెనీ. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభం కానుంది. జూలై 10వ తేదీన ఈ కారు లాంచ్ అయింది. కొంతమంది డీలర్ల ప్రకారం ఈ కారు వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతానికి 12 వారాల వరకు ఉంది. డిమాండ్‌ను బట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.


హ్యుందాయ్ తెలుపుతున్న దాని ప్రకారం జూలై 10వ తేదీకి ముందు కంపెనీ ఎక్స్‌టర్ కోసం 10,000 బుకింగ్‌లను పొందగా ప్రారంభించిన ఒక నెలలోనే ఈ సంఖ్య 50,000ను దాటింది. ఈ కారుకు సంబంధించి గరిష్ట బుకింగ్స్ సన్‌రూఫ్ వేరియంట్ కోసం వస్తున్నాయి. దాదాపు 75 శాతం బుకింగ్స్ సన్‌రూఫ్ వేరియంట్ కోసమే అవుతున్నాయి. కారు SX, SX(O), SX(O) కనెక్ట్ వేరియంట్‌లలో వాయిస్ యాక్టివేటెడ్ ఫీచర్‌లతో సింగిల్ పేన్ సన్‌రూఫ్‌ను పొందుతుంది.


5 స్పీడ్ ఏఎంటీ వేరియంట్ కోసం 33 శాతం బుకింగ్‌లు ఉన్నాయని, ఇందులో ప్యాడిల్ షిఫ్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. అయితే ఈ సదుపాయం కేవలం పెట్రోల్‌ వేరియంట్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్ అందుబాటులో లేదు.


హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ కారు ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) Connect అనే ఐదు ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ (స్మార్ట్ ఆటో ఏఎంటీ), 1.2 లీటర్ బై ఫ్యూయల్ కప్పా పెట్రోల్ విత్ సీఎన్‌జీ ఇంజిన్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ మార్కెట్లోకి వచ్చింది.


హ్యుండాయ్ ఎక్స్‌టర్‌లో రెండు డిస్‌ప్లేలు అందించారు. వీటిలో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం మొదటిది. 4.2 అంగుళాల టీఎఫ్‌టీ మిడ్ డిస్‌ప్లే కూడా అందించారు. ఈ కారులో 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరా డ్యాష్ క్యాం ఫీచర్లు కూడా అందించారు. ఈ ధరల విభాగంలో మొదటిసారిగా స్మార్ట్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరా డ్యాష్ క్యాం ఫీచర్లతో లాంచ్ అయిన ఎస్‌యూవీ ఇదే.


ధర ఎంత?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్యలో ఉంది. టాటా పంచ్, మారుతి సుజుకి ఇగ్నిస్‌తో హ్యుందాయ్ ఎక్స్‌టర్ పోటీ పడనుంది. టాటా ఇటీవల పంచ్‌ను సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్, సన్‌రూఫ్‌తో అప్‌గ్రేడ్ చేసింది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial