Hyundai Alcazar Price Hike: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ నెలలో తన మూడు వరుసల ఎస్‌యూవీ అయిన అల్కజార్ ధరలను అప్‌డేట్ చేసింది. ఈ 7 సీటర్ క్రెటా ఆధారిత SUV ఎక్స్ షోరూమ్ ధర ఇప్పుడు రూ. 16.77 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (వో), ప్లాటినం, ప్లాటినం (వో), సిగ్నేచర్, సిగ్నేచర్ (వో) వంటి ఏడు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.


కొత్త ధర ఎంత?
కొత్త అల్కజార్‌లో ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్‌ల ధరలు అదే మొత్తంలో రూ. 4,900 పెరిగాయి. అయితే దీని పెట్రోల్ వెర్షన్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీని పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 16.77 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. డీజిల్ ఇంజిన్ ఉన్న వేరియంట్‌లు రూ. 17.78 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి.


ఇంజిన్ ఇలా...
హ్యుందాయ్ అల్కజార్ మార్కెట్లో రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఇది వరుసగా 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. రెండో డీజిల్ ఇంజన్ కూడా 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌ ఆప్షన్‌తో రానుంది.


హ్యుందాయ్ అల్కాజర్ ఫీచర్లు
10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇతర ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ కంట్రోల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరా డాష్ క్యామ్ సెటప్ ఉన్నాయి.


సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే...  స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వెనుక పార్కింగ్ కెమెరా, 360 డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఉన్నాయి.


మరోవైపు హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ త్వరలో మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను పొందబోతున్నట్లు తెలుస్తోంది. దాని డిజైన్ వివరాలు చాలా వరకు బయటకు వచ్చాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో కనిపించే బ్రాండ్ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని ఈ అల్కజార్‌లో అందించే అవకాశం ఉంది. 2024 ప్రారంభంలో లాంచ్ అయ్యే క్రెటా ఫేస్‌లిఫ్ట్ తరహాలో కూడా అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. అప్‌డేట్ చేసిన అల్కజార్ ముందు భాగంలో రీడిజైన్ చేసిన గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్‌తో అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, అప్‌డేట్ చేసిన బంపర్ వచ్చే అవకాశం ఉంది. అయితే సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం పెద్దగా మార్పు ఉండదు. ఇందులో కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు, వెనుకవైపు కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, బంపర్‌లో మరికొన్ని అప్‌డేట్‌లను కూడా చూడవచ్చు.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!