Discount On Honda Elevate: హోండా కార్లపై కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. హోండా మాత్రమే కాదు చాలా మంది వాహన తయారీదారులు తమ మొత్తం లైనప్‌లో గొప్ప డిస్కౌంట్లను అందిస్తున్నారు. గత నెలలో జపాన్ వాహన తయారీదారులు తమ కార్లపై ఏడేళ్ల వారంటీ లేదా అన్‌లిమిటెడ్ కిలోమీటర్స్ ఎక్స్‌టెండెడ్ వారంటీని అందించారు. దీనితో పాటు కారుపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందించనున్నారు.


హోండా అమేజ్‌పై తగ్గింపు
హోండా అమేజ్ రెండో తరం మోడల్ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ హోండా కారుపై రూ.1.07 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కారు మూడవ తరం మోడల్ కూడా మార్కెట్లోకి వచ్చింది. ఈ కారుపై తగ్గింపుతో పాటు రూ.40 వేల వరకు అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు. అమేజ్ రెండో తరం మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.19 లక్షల నుంచి మొదలై రూ. 9.04 లక్షల వరకు ఉంటుంది.


హోండా సిటీపై తగ్గింపు
హోండా సిటీ పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌పై రూ.70,000 ప్రయోజనాలు అందిస్తున్నారు. అయితే హోండా సిటీ ఈ: హెచ్ఈవీ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై రూ. 90,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఈ హోండా కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.18 లక్షల నుంచి మొదలై రూ. 23.60 లక్షల వరకు ఉంటుంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా వంటి కార్లతో హోండా అమేజ్ పోటీపడుతోంది. ఈ కారుకు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


హోండా ఎలివేట్‌పై తగ్గింపు
హ్యుందాయ్ క్రెటా ప్రత్యర్థి హోండా ఎలివేట్ కూడా తగ్గింపు పొందుతోంది. ఈ కారుపై రూ.86,100 విలువైన ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈ హోండా కారు అపెక్స్ ఎడిషన్, బ్లాక్ ఎడిషన్ జనవరి 7వ తేదీన మార్కెట్లోకి విడుదల కానున్నాయి. హోండా ఎలివేట్ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 11.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దాని టాప్ వేరియంట్ ధర రూ. 16.71 లక్షల వరకు ఉంటుంది.


ఈ హోండా కారులో 1.5 లీటర్ నేచురల్లీ పెట్రోల్ ఇంజన్ అందించారు. దీనితో మాన్యువల్, సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ హోండా కారులోని ఇంజన్ 121 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!