Why is Goa tourism dying: డిసెంబర్ 31 పార్టీ అంటే మన దేశంలో ఎక్కడెక్కిడి టూరిస్టు ప్రాంతాలు కూడా కిక్కిరిసిపోతాయి. మరి గోవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ అసలు వాస్తవం ఏమింటే ఈ సారి గోవాలో అసలు సందడే లేదు.  ఈ డిసెంబర్ 31కి.. 2025కి కొత్త ఏడాదికి ఆహ్వానించే పండుగకు.. గోవా బోసిపోయింది.  పర్యాటకులు అసలు సాధారణంగా వచ్చే అంత మంది కూడా రాలేదు. దీంతో రిసార్టులు, హోటల్స్ సహా బీచ్‌లు అన్నీ ఖాళీగా ఉన్నాయి.  గోవాలో పరిస్థితి మారిపోయిందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. 


అరవై శాతం తగ్గిపోయిన పర్యాటకులు


గోవాలో డిసెంబర్ 31 పార్టీకి మాత్రమే గోవాకు పర్యాటకులు వెళ్లలేదనడం  కరెక్ట్ కాదు. మొత్తం లెక్కలు చూస్తే  గత ఏడాది మొత్తం మీద గోవాకు వచ్చే పర్యాటకులు ఏకంగా అరవై శాతం తగ్గిపోయారు. గోవాకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తూంటారు. సగటున ఏడాదికి పది లక్షల మంది గోవాకు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. 2024లో అలా వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం 4 లక్షలు మాత్రమే అంటే నమ్మి తీరాలి. ఎందుకంటే ఇవి ప్రభుత్వం చెబుతున్న వాస్తవాలు.  


 





 


పర్యాటకుల్ని దోచుకోవడమే మైనస్ ! 


1990  నాటికి గోవా ప్రపంచంలోనే ప్రముఖ టూరిజం స్పాట్ గా మారిపోయింది. పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అదే సమంయలో దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరరగడం, గోవాలో ఎంజాయ్ మెంట్ గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది.  కొన్ని అవలక్షణాలు కూడా పెరిగిపోవడంతో  పతనం ప్రారంభమయింది.   టూరిస్టుల మీద ఆధారపడి వ్యాపారం చేసే వారు ... పర్యాటకుల్ని తమ దోపిడీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎయిర్ పోర్టులో లేదా రైల్వే స్టేషన్ లో దిగిన దగ్గర నుంచి టాక్సీ సహా హోటల్ మాపియా వరకూ దోపిడీ చేసి వదిలి పెడుతుంది. అందుకే టూరిస్టులు రాను రాను తగ్గించారు. 



తెలుగు యువకుడ్ని కొట్టి చంపిన మాఫియా - అలాంటివి ఎన్నో ఘటనలు 


పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే డిసెంబర్ 31న హోటల్ రేట్లు ఎక్కువ ఎందుకు వేశారని అడిగినందుకు తెలుగు యువకుడైన తాడేపల్లిగూడెంకు చెందిన రవితేజ అనే యువకుడ్ని కొట్టి చంపారు. గోవా ఆర్థిక వ్యవస్థ కూడా టూరిజం మీదనే ఆధారపడి ఉంటుంది. అక్కడి ప్రజల్లో 35 శాతం పర్యాటచకులు ఎక్కువగా వస్తేనే లాభపడుతారు. అయితే అలాంటి చోట్ల కూడా పర్యాటకుల్ని దోపిడీ చేయడానికి సిద్దపడటంతో చాలా మంది వేరే వేరే టూరిజం ప్రాంతాలు చూసుకుంటున్నారు. అందుకే గోవాకు వచ్చే పర్యాటకులు తగ్గిపోయారు. 


వియత్నాం, శ్రీలంకకు టూరిస్టుల ప్రాధాన్యం 


చివరికి దేశీయ పర్యాటకులు కూడా ఎక్కువగా వియత్నాం, ధాయ్ లాండ్, శ్రీలంకలకు వెళ్లారు.   పరిస్థితి చూస్తూంటే.. గోవా టూరిజం అవసాన దశకు చేరిందని అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని మొత్తం ప్రపంచ పర్యాటక రంగమే స్లోగా ఉందని అ ప్రబావం గోవాపై పడిందని అంటున్నారు. 2025లో గోవాకు పర్యాటకులు పెరగాలంటే ఎన్నో సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటున్న అభిప్రాయం వినిపిస్తోంది.