Best Scooter In India: భారత మార్కెట్లో అనేక రకాల స్కూటర్లు ఉన్నాయి. కానీ ప్రజలు ఎక్కువగా మైలేజీ, తక్కువ ధర కలిగిన స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్... ఈ రెండు పాయింట్లకు సరిగ్గా సరిపోతాయి. ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్న స్కూటీల లిస్ట్‌లో కూడా ఉన్నాయి. మార్కెట్లో హోండా, టీవీఎస్ అందిస్తున్న ఈ మోడళ్లకు చాలా డిమాండ్ ఉంది.


హోండా యాక్టివా
హోండా యాక్టివా మెరుగైన మైలేజీని ఇచ్చే ద్విచక్ర వాహనం. ఈ స్కూటర్‌లో 4 స్ట్రోక్, ఎస్ఐ ఇంజన్ ఉంది. ఈ స్కూటర్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ (వీ-మ్యాటిక్) ట్రాన్స్‌మిషన్ కూడా కనెక్ట్ చేయబడింది. యాక్టివాలో అమర్చిన ఈ ఇంజన్ 5.77 కేడబ్ల్యూ శక్తిని ఇస్తుంది. 8.90 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హోండా స్కూటర్ 1260 ఎంఎం వీల్ బేస్, 162 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.


యాక్టివా మైలేజ్, ధర ఎలా ఉన్నాయి?
హోండా యాక్టివా 51.23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ స్కూటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. కాబట్టి ఒకసారి ట్యాంక్ నిండితే ఈ స్కూటర్‌ను దాదాపు 270 కిలోమీటర్లు నడపవచ్చు. ఈ హోండా స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 76,600 నుంచి మొదలై రూ. 82,600 వరకు ఉంటుంది. నగరాన్ని బట్టి ఈ ధరలో తేడా ఉండవచ్చు. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


టీవీఎస్ జూపిటర్
టీవీఎస్ జూపిటర్ ఇంజన్ గురించి చెప్పాలంటే ఇందులో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజన్ అందుబాటులో ఉంది. స్కూటర్‌లోని ఈ ఇంజన్ 6,500 ఆర్పీఎం వద్ద 5.9 కేడబ్ల్యూ పవర్‌ని, 5,000 ఆర్పీఎం వద్ద 9.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఈ ద్విచక్ర వాహనంలో ముందు 220 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ ఉంది.


జూపిటర్ మైలేజ్, ధర
టీవీఎస్ జూపిటర్ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 53 కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్ 5.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇది ఒక్క ఫుల్ ట్యాంక్‌పై దాదాపు 270 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. టీవీఎస్ జూపిటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.74,600 నుంచి ప్రారంభం అవుతుంది.


ఏ స్కూటర్ మంచిది?
ఈ రెండు స్కూటర్ల మైలేజీని పరిశీలిస్తే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్. రెండు ద్విచక్ర వాహనాల మైలేజ్ లీటరుకు 50 కిలోమీటర్ల వరకు ఉండనుంది. దీంతో పాటు రెండు స్కూటర్ల ధరలో పెద్దగా తేడా లేదు. స్కూటర్ డిజైన్, కలర్‌ను పరిగణనలోకి తీసుకొని రెండు మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేయవచ్చు.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?