Hyderabad Metro Service: కొత్త ఏడాదిని గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ హడావుడి నడుస్తోంది. పార్టీల్లో మందు విందు ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయి. అయితే ఈ టైంలో హైదరాబాద్ మెట్రో వారికి గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 రోజున మంగళవారం రాత్రి సర్వీస్ టైమింగ్స్ పెంచుతున్నట్టు పేర్కొన్నారు. రాత్రి 12.30 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెళ్లడించారు. 


పార్టీ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్లేందుకు నగరవాసులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేసింది. ఆఖరి స్టేషన్‌లో రాత్రి 12.30కి లాస్ట్ ట్రైన్ బయల్దేరనుంది. అంటే ఎల్బీనగర్‌లో రాత్రి 12.30 గంటలకు, నాగోల్‌లో రాత్రి 12.30గంటలకు, మియాపూర్‌, రాయ్‌దుర్గ్‌లో కూడా అదే టైంకు ఆఖరి మెట్రో ట్రైన్ బయల్దేరనుంది. వివిధ పాయింట్స్ నుంచి రాత్రి 12.30కి బయల్దేరిన ట్రైన్ ఆఖరి గమ్యానికి రాత్రి 1.15కు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.