Hero Vida VX2 Go Price:పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్న వేళ ఎలక్ట్రిక్ వాహనాలు ఒక మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. అయితే ఇవి కొనాలంటే భారీ ధర చెల్లించాల్సి వచ్చేది. మార్కెట్‌లో ఉన్న గ్యాప్‌ను గమనించిన హీరో కంపెనీ సరికొత్త వ్యూహంతో విడా VX2 గో విడుదల చేసింది. తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్న ఈ స్కూటర్ ఫీచర్స్, ఇతర విషయాలు గురించి ఇక్కడ చూద్దాం. 

బాస్‌ మోడల్‌తో వస్తున్న హీరో విడా VX2 గో

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలో 40 నుంచి 50 శాతం కేవలం బ్యాటరీ ఖర్చే ఉంటుంది. దీని వల్ల మధ్యతరగతి ప్రజలు ఇవి కొనడానికి వెనకాడుతున్నారు. ఈ అడ్డంకిని తొలగించడానికి హీరో సంస్థ బ్యాటరీ యాజ్‌‌ ఏ సర్వీస్‌ అనే వినూత్న విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పద్ధతిలో మీరు స్కూటర్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసి బ్యాటరీ వినియోగానికి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా నెలకు కొంత మొత్తాన్ని చెల్లించవచ్చు. దీని వల్ల స్కూటర్ ప్రారంభ ధర గణనీయంగా తగ్గింది. 

Read Also: Honda City Facelift vs Hyundai Verna Facelift: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ - మిడ్‌సైజ్ సెడాన్ కార్ల ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లు, ప్రైస్ కంపారిజ‌న్ 

విడా VX2 గో ధర 45 వేల నుంచి ప్రారంభం

విడా VX2 గో స్కూటర్ ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర 44,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో టాప్ వేరియంట్‌ ధర 59,490 రూపాయలుగా ఉంది. ప్రస్తుత మార్కెట్‌లోని హై ఎండ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోలిస్తే ఇది అత్యంత సరసమైన ఎంపికగా నిలుస్తోంది. 

Read Also: India Steps Up Towards E100 Fuel Adoption: ఇండియాలో ఈ100 ఇంధన విప్లవం - క్లీనర్ మొబిలిటీ దిశగా అడుగులు.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు కొత్త బూస్ట్

ఒకసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు 

ఈ స్కూటర్‌ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల బ్యాటరీ సెటప్‌లతో లభిస్తుంది. 2.2kWh, 3.4kWh ఆప్షన్లు ఉన్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 92 నుంచి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గంటలకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో నడపచ్చు. ఇది నగరాల్లో ప్రయాణించడానికి సరిగా సరిపోతుంది. 

జియో ఫెన్సింగ్‌ సౌకర్యం

తక్కువ ధరకే వస్తున్నప్పటికీ ఫీచర్ల విషయంలో హీరో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీని జోడించింది. 4.3 అంగుళాల స్మార్ట్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది. బ్లూటూత్‌ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా నావిగేషన్, బ్యాటరీ లెక్కలు స్క్రీన్‌పై చూసుకోవచ్చు. వాహనం చోరీకి గురికాకుండా యాంటీ థెఫ్ట్‌ ట్రాకింగ్‌, ఒక నిర్ణీత పరిధి దాటి వెళ్తే అలర్ట్ చేసే జియో ఫెన్సింగ్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. 

ఈ స్కూటర్‌ నిర్వహణ చాలా సులభం, అత్యంత చౌకైంది. ఇందులో బ్యాటరీ సులభంగా బయటకు తీసి, ఇంట్లోని సాధారణ ప్లగ్‌ పాయింట్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు. పెట్రోల్‌ స్కూటర్లతో పోలిస్తే దీని రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. ఒక కిలోమీటరు ప్రయాణానికి కేవలం రూ. 0.90 నుంచి 1.47 మాత్రమే ఖర్చు అవుతుంది. 

భారత్‌లో ఎలక్ట్రిక్ విప్లవం వేగంగా పుంజుకుంటోంది. గాలి కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, సామాన్యుడి ప్రయాణ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా హీరో విడా VX2 గోను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. మధ్యతరగతి కుటుంబాలకు, విద్యార్థులకు, నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక అద్భుతమైన వరంగా కంపెనీ చెబుతోంది.