బాలకృష్ణ నందమూరి (Balakrishna Nandamuri), దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni)లది సూపర్ డూపర్ హిట్ క్రేజీ కాంబినేషన్. 'వీర సింహా రెడ్డి' సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నారు. అది బాలయ్య 111వ సినిమా. అందుకని, NBK111 అని పిలుస్తున్నారు. ఈ సినిమా నుంచి బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday)కు ఓ గిఫ్ట్ రాబోతోంది.
బాలకృష్ణ పుట్టినరోజుకు సర్‌ప్రైజ్Nandamuri Balakrishna Birthday Special 2026: జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఆ రోజు అంటే నందమూరి అభిమానులకు పండగ రోజు. ఈ ఏడాది పండుగను మరింత స్పెషల్ చేసేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని రెడీ అవుతున్నారు. జూన్ 10న అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేస్తున్నారు.
బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా? లేదంటే డైలాగుతో కూడిన టీజర్ విడుదల చేస్తారా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్‌లో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేశారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు ఆయన బృందం ముంబైలో లొకేషన్ రెక్కీలో బిజీ. నెక్స్ట్ షెడ్యూల్ అక్కడ చేయనున్నారు.
బాలకృష్ణ సినిమాలో మంచు మనోజ్!బాలకృష్ణ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఆ విషయం వినబడుతోంది. అయితే... మనోజ్ బర్త్ డేకు ఆ సంగతి అనౌన్స్ చేశారు. పవర్ ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచు మనోజ్ కనిపించబోతున్నారు.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని తాజా సినిమాలో తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇంతకు ముందు 'భగవంత్ కేసరి'లో ఆమె నటించారు. ఇది బాలయ్యతో ఆమెకు రెండో సినిమా. మొదట నయనతార నటిస్తున్నట్టు చెప్పారు. అయితే కథలో మార్పులు జరగడంతో ఆమె బదులు కాజల్ వచ్చినట్టు తెలిసింది. వృద్ధి సినిమాస్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
