Mahesh Babu Next Movie After Varanasi: మహేష్ బాబు అభిమానులతో పాటు సగటు తెలుగు సినిమా అభిమాని, ప్రేక్షకులు మాత్రమే కాదు... పాన్ ఇండియా సినిమా లవర్స్ కూడా 'వారణాసి' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా చిత్రీకరణలో మహేష్ బిజీ బిజీ. మరి, ఆ సినిమా అయ్యాక ఎవరితో సినిమా చేస్తారు? ఆయన నెక్స్ట్ సినిమా ఏమిటి? అనేది డిస్కషన్ ఆల్రెడీ మొదలయ్యింది.
పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో!?రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ మీద తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ఆయన భారీ హిట్స్ అందుకోవడమే కాదు... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడు అనే బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయనతో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తారని టాక్ బలంగా వినబడుతోంది. మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సెట్ అవుతుందా? పరిస్థితులు ఎలా ఉన్నాయి? వంటి అంశాలను పరిశీలిస్తే?
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' (Dragon) సినిమా పనుల్లో చాలా బిజీ. ఆ సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ జూన్‌లో. 'డ్రాగన్' తర్వాత పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు ఉన్నాయి. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ షెడ్యూల్ ఫిక్స్. 'డ్రాగన్' పూర్తి చేశాక ప్రభాస్ 'సలార్ 2', కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్: చాప్టర్ 3' ఫినిష్ చేయాలి. ఆ కమిట్‌మెంట్‌లు పూర్తి అయ్యాక వేరే హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. కొత్త సినిమాల ఆలోచించే వెసులుబాటు ఉంటుంది.
Also Read: Peddi Japan Release Update - రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌కు నిరాశ... 'పెద్ది' విడుదలలో పెద్ద ట్విస్ట్
ఒకవేళ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా చేయాలని అనుకున్నా... స్క్రిప్ట్ రెడీ చేయడం దగ్గర నుంచి ప్రీ-ప్రొడక్షన్ వరకు కనీసం ఏడాది పడుతుంది. ప్రజెంట్ 'వారణాసి' చేస్తున్న మహేష్... ఈ ఏడాది ఆగస్టుకు చిత్రీకరణ పూర్తి చేసి ఫ్రీ అవుతారు. ఏప్రిల్ 2027లో 'వారణాసి' విడుదల కనుక మధ్యలో కొన్ని నెలలు ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల... మహేష్, ప్రశాంత్ నీల్ కాంబో సెట్ అవ్వడానికి చాలా టైం ఉంది. మధ్యలో ఈజీగా మహేష్ మరో సినిమా చేయవచ్చు.
Also Read: Mouni Roy Disha Patani Relationship - ఎఫైర్ కాదు... దిశాతో రిలేషన్షిప్ గురించి మౌనీ రాయ్ క్లారిటీ
ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే... మహేష్ బాబును హోంబలే ఫిల్మ్స్ ఈ మధ్య కాలంలో సంప్రదించలేదు. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ రెండు సినిమాలు ఆ సంస్థకు చేయాలని కమిట్‌మెంట్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఒకసారి మహేష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా చేయాలని ప్రయత్నించింది. అయితే అప్పట్లో కుదరలేదు. ప్రశాంత్ నీల్ ముందస్తు కమిట్‌మెంట్స్ కారణంగా అప్పట్లో ఓకే చెప్పలేదు. ఇప్పుడు కూడా సేమ్ సిట్యువేషన్.
మరోవైపు 'వారణాసి' విడుదల తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదని మహేష్ బాబు డిసైడ్ అయ్యారట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అన్వేషణలో ఉన్నారట. ఇప్పుడు ఖాళీగా ఉండకుండా వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి.
