రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4వ తేదీన (Peddi Release Date) థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. ప్రెస్ మీట్లు, భారీ ఈవెంట్లు... సినిమా ప్రమోట్ చేసే విషయంలో రామ్ చరణ్ నుంచి టీమ్ వరకు ఎవ్వరూ తగ్గడం లేదు. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. జూన్ 4వ తేదీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే... 'పెద్ది' విడుదల కోసం ఎదురు చూస్తున్న జపాన్ అభిమానులకు ఓ పిడుగులాంటి వార్త ఇది. 

Continues below advertisement

జపాన్‌లో సేమ్ డే రిలీజ్ లేదుPeddi Japan Release Update: 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా జపాన్ దేశంలోనూ బాగా ఆడింది. రామ్ చరణ్ నటనకు అక్కడి జనాలు ఫిదా అయ్యారు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అది దృష్టిలో పెట్టుకుని... చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు, తొలుత ఈ చిత్రాన్ని ఇండియాతో పాటు జపాన్‌లో కూడా సేమ్ డే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దాంతో రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. అయితే... విడుదలకు కొద్ది రోజుల ముందు 'పెద్ది' టీమ్ జపాన్ రిలీజ్ విషయంలో ఊహించని నిర్ణయాన్ని ప్రకటించింది. దాంతో అభిమానులకు పెద్ద షాక్ తగిలింది.

Also Read: Drishyam 3 Collections Day 6 - మంగళవారం పర్వాలేదు... స్టడీగా మోహన్ లాల్ 'దృశ్యం 3' కలెక్షన్లు - టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Continues below advertisement

తాజా సమాచారం ప్రకారం... కొన్ని అనివార్య కారణాల వల్ల 'పెద్ది' జపాన్ రిలీజ్ క్యాన్సిల్ చేశారు. అంటే... జూన్ 4న 'పెద్ది' జపనీస్ వెర్షన్ అక్కడ విడుదల కాదు. తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ వార్త రామ్ చరణ్‌ జపాన్‌ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసింది. 'పెద్ది' విడుదల కోసం ఎదురు చూస్తున్న జపాన్‌లోని భారతీయులు కూడా ఈ నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌లో సేమ్ డే రిలీజ్ అయ్యి ఉంటే గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ నమోదు అయ్యేవని చెబుతున్నారు.

Also ReadDon 3 Controversy - రణవీర్ సింగ్ వర్సెస్ ఫర్హాన్ అక్తర్... ధురంధర్ స్టార్‌పై దర్శకుడు గరమ్ గరమ్... 45 కోట్లు ఇవ్వాలని డిమాండ్... 'డాన్ 3' కాంట్రవర్సీ ఫుల్ డీటెయిల్స్

Peddi Cast And Crew: బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఇతర పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Also ReadBandla Ganesh - Pawan Kalyan: సింహాన్ని నిద్ర లేపొద్దని చెప్పాం... పవన్ ఆట మొదలైంది - బండ్ల గణేష్ ట్వీట్ వైరల్