Drishyam 3 Collection Worldwide Till Now: మోహన్ లాల్ హీరోగా నటించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3'. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా అప్రతిహత జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. థియేటర్లలో విడుదలైన ఆరు రోజుల్లో ఈ సినిమా అద్భుతమైన వసూళ్ళు రాబట్టింది. వీకెండ్ తర్వాత సినిమావ సూళ్ళు తగ్గాయి. ఢమాల్ అంటూ కిందకు పడింది. మండేతో కంపేర్ చేస్తే... మంగళవారం కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఆరో రోజు 'దృశ్యం 3' ఎంత కలెక్ట్ చేసింది? ఆరు రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంత? అనేది చూస్తే...

Continues below advertisement

'దృశ్యం 3' @ 170 కోట్లు... ఆరో రోజు?Drishyam 3 Six Days Collection: ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో 'దృశ్యం 3' రూ. 170.32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇండియాలో ఈ సినిమా ఆరో రోజు... అంటే మొదటి మంగళవారం రూ. 6.45 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. మండేతో పోలిస్తే 16.2 శాతం తక్కువ. 

ఇండియాలో 'దృశ్యం 3' ఆరు రోజుల నెట్ కలెక్షన్లు రూ. 68.60 కోట్లు. ఇండియాలో ఆరు రోజుల 'దృశ్యం 3' గ్రాస్ వసూళ్లు రూ. 79.62 కోట్లు.ఓవర్సీస్‌లో 'దృశ్యం 3' ఆరో రోజు గ్రాస్ కలెక్షన్లు రూ. 6 కోట్లు. టోటల్ ఆరు రోజుల ఓవర్సీస్ గ్రాస్ రూ. 90.70 కోట్లు.వరల్డ్ వైడ్ లెక్కలు చూస్తే... 'దృశ్యం 3' ఆరు రోజుల గ్రాస్ 170.32 కోట్లు. 

Continues below advertisement

Also Read: Bandla Ganesh - Pawan Kalyan: సింహాన్ని నిద్ర లేపొద్దని చెప్పాం... పవన్ ఆట మొదలైంది - బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

మోహన్ లాల్ కెరీర్‌లో 150 కోట్ల మూడో సినిమాఓవర్సీస్ మార్కెట్‌లో 'దృశ్యం 3' సినిమా సత్తా చాటుతోంది. ఇండియాతో కంపేర్ చేస్తే... విదేశాల నుంచి సినిమాకు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. మోహన్ లాల్ కెరీర్‌లో రూ. 150 కోట్ల కలెక్షన్స్ మార్కును దాటిన మూడో సినిమాగా 'దృశ్యం 3' నిలిచింది. అంతే కాదు... మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఆల్రెడీ 8వ స్థానానికి చేరుకుంది. 

Also ReadDon 3 Controversy - రణవీర్ సింగ్ వర్సెస్ ఫర్హాన్ అక్తర్... ధురంధర్ స్టార్‌పై దర్శకుడు గరమ్ గరమ్... 45 కోట్లు ఇవ్వాలని డిమాండ్... 'డాన్ 3' కాంట్రవర్సీ ఫుల్ డీటెయిల్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'దృశ్యం 3' కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో ఆరో రోజు ఇక్కడ రూ. 0.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా... ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రూ. 7 కోట్ల నెట్ రాబట్టిందీ సినిమా.

జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన 'దృశ్యం 3'లో మోహన్ లాల్ మరోసారి 'జార్జ్ కుట్టి' పాత్రలో అలరించారు. ఆశీర్వాద్ సినిమాస్, పనోరమా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో మీనా, అన్పిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్ధిక్, ఆశా శరత్ కీలక పాత్రలు పోషించారు. మే 21, 2026న ఈ సినిమా విడుదలైంది. కేరళ ఆడియన్స్‌ ఆదరణతో సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది.

Also ReadRanveer Singh - తెలుగులో రణవీర్‌ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు