Honda City Facelift vs Hyundai Verna Facelift Price Specifications And Features: ఇండియన్ మిడ్‌సైజ్ సెడాన్ మార్కెట్లో హోండా కార్స్ ఇండియా సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేసింది. కాస్మెటిక్ డిజైన్ మార్పులు, అప్‌డేటెడ్ ఇంటీరియర్, అదనపు ఫీచర్లతో వచ్చిన ఈ కారు వోక్స్‌వ్యాగన్ విర్చుస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి పాపులర్ సెడాన్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త హోండా సిటీ మోడల్‌ను హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ కారుతో పోల్చి చూస్తే వేరియంట్లు, ధరలు, కొలతలలో చాలా ఆసక్తికరమైన తేడాలు కనిపిస్తున్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ను ఆన్‌లైన్ లేదా డీలర్‌షిప్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Read Also: CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో! 

ధరలు, వేరియంట్ల పరంగా..

కొత్త హోండా సిటీ బేస్ వేరియంట్ ఎస్‌వీ పెట్రోల్ మాన్యువల్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.99 లక్షలుగా ఉంది. దీని వి ట్రిమ్ మాన్యువల్ రూ. 13.29 లక్షలు, సీవీటీ రూ. 14.29 లక్షలుగా ఉన్నాయి. జెడ్ఎక్స్ మోడల్ మాన్యువల్ రూ. 15.25 లక్షలు, సీవీటీ రూ. 16.25 లక్షలు కాగా, టాప్ వేరియంట్ జెడ్ఎక్స్ ప్లస్ మాన్యువల్ రూ. 16.14 లక్షలు, సీవీటీ రూ. 17.14 లక్షలకు లభిస్తోంది. దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ధర రూ. 20.99 లక్షలుగా ఉంది. మరోవైపు హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ కొత్తగా హెచ్ఎక్స్2, హెచ్ఎక్స్4, హెచ్ఎక్స్6, హెచ్ఎక్స్6 ప్లస్, హెచ్ఎక్స్8, హెచ్ఎక్స్10 అనే ఆరు వేరియంట్లలో లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10.98 లక్షల నుండి రూ. 18.25 లక్షల రేంజ్ లో ఉన్నాయి.

Read Also: 2026 TVS Jupiter 125 Colors: టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి...

 బాడీ సైజ్.. బూట్ స్పేస్

కార్ల కొలతలను పరిశీలిస్తే హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ 4,535 మిమీ పొడవు, 1,765 మిమీ వెడల్పు, 1,475 మిమీ ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2,670 మిమీ కాగా, బూట్ స్పేస్ 528 లీటర్లుగా ఉంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ 4,584 మిమీ పొడవు, 1,748 మిమీ వెడల్పు, 1,489 మిమీ ఎత్తుతో వస్తోంది. దీని వీల్‌బేస్ 2,600 మిమీ, బూట్ స్పేస్ 506 లీటర్లుగా ఉన్నాయి. హోండా సిటీతో పోలిస్తే హ్యుందాయ్ వెర్నా 49 మిమీ తక్కువ పొడవు, 14 మిమీ తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ, 17 మిమీ ఎక్కువ వెడల్పును కలిగి ఉంది. వెర్నాలో వీల్‌బేస్ 70 మిమీ ఎక్కువగా ఉండటంతో పాటు 22 లీటర్ల అదనపు బూట్ స్పేస్ లభిస్తుంది. రెండు సెడాన్ల గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం సమానంగా 165 మిమీ ఉంటుంది.

పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు.. 

హ్యుందాయ్ వెర్నాలో 115 పీఎస్ పవర్ ఇచ్చే 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ తో పాటు 160 హెచ్‌పీ పవర్ జనరేట్ చేసే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. హోండా సిటీలో 121 బీహెచ్‌పీ పవర్ ఇచ్చే 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌తో పాటు సెగ్మెంట్-ఫస్ట్ గా 124 హెచ్‌పీ పవర్, లీటరుకు 27.26 కిమీ మైలేజ్ ఇచ్చే అట్కిన్సన్ సైకిల్ హైబ్రిడ్ ఇంజన్‌ను అందించారు. ఫీచర్ల పరంగా హోండా సిటీలో 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్ 2 అడాస్ (ADAS) ఉన్నాయి. వెర్నాలో డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్స్, బోస్ స్పీకర్లు, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్లు, ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్, 7 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్ 2 అడాస్ వంటి మోడర్న్ ఫీచర్లు లభిస్తున్నాయి.