Hero Splendor Model Wise Mileage: భారతీయ మార్కెట్లో హీరో స్ప్లెండర్ చాలా సంవత్సరాలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. నగరమైనా, గ్రామమైనా, ఎక్కడ చూసినా ఈ బైకే కనిపిస్తుంది. ఈ బైక్ తక్కువ ధరలో వస్తుంది. అలాగే మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంది. హీరో స్ప్లెండర్ అనేక వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఇందులో స్ప్లెండర్ ప్లస్, ఎక్స్‌టెక్, సూపర్ స్ప్లెండర్ బైక్‌లు ఉన్నాయి.


మీరు కూడా హీరో స్ప్లెండర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఏ మోడల్ అత్యధిక మైలేజీని ఇస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్ప్లెండర్‌కు సంబంధించిన అన్ని వేరియంట్‌ల ధర, మైలేజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఏ వేరియంట్‌ ఎంత మైలేజీ ఇస్తుంది?
హీరో స్ప్లెండర్ ప్లస్ వేరియంట్ గురించి చెప్పాలంటే ఇది భారతీయ మార్కెట్‌లో ప్రసిద్ధి చెందిన బైక్. దీని ఎక్స్ షోరూం ధర రూ.76,356 నుంచి రూ.79,336 మధ్యలో ఉంది. స్ప్లెండర్ ప్లస్‌లో 97.2 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే స్ప్లెండర్ ప్లస్ సుమారు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్
రెండో వేరియంట్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్. దీని ధర భారతీయ మార్కెట్లో రూ. 80 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మోటార్‌సైకిల్‌లో 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ బైక్ మైలేజీ గురించి మాట్లాడుకుంటే ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. హీరో స్ప్లెండర్‌లో ఈ వేరియంట్ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది.


హీరో సూపర్ స్ప్లెండర్
హీరో స్ప్లెండర్ బైక్ మూడో వేరియంట్ సూపర్ స్ప్లెండర్. దీని ధర రూ. 82 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో మీరు 124.7 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని పొందుతారు. ఈ సూపర్ స్ప్లెండర్ బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. ఈ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో సహా అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!