Hero MotoCorp October 2024 Sales Report: హీరో మోటోకార్ప్ ఇటీవలే 2024 అక్టోబర్ కోసం బైక్‌లు, స్కూటర్ల విక్రయాల నివేదికను విడుదల చేసింది. గత నెలలో హీరో విపరీతమైన సేల్స్‌ను సాధించింది. హీరో మోటోకార్ప్ మరోసారి దేశంలో నంబర్ వన్ ద్విచక్ర వాహన కంపెనీగా అవతరించింది. అత్యధికంగా అమ్ముడుపోయిన హీరో బైక్‌గా హీరో స్ప్లెండర్ నిలిచింది.
2024 అక్టోబర్‌లో హీరో మోటోకార్ప్ 6,79,091 యూనిట్ల బైక్‌లు, స్కూటర్లను విక్రయించింది. 2023 అక్టోబర్‌లో ఈ సంఖ్య 5,74,930 యూనిట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ 18.12 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
దీనితో పాటు కంపెనీ నెలవారీ ప్రాతిపదికన కూడా వృద్ధిని నమోదు చేసింది. 2024 సెప్టెంబర్‌లో కంపెనీ మొత్తం 6,37,050 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ విధంగా అక్టోబర్ నెలలో 6.60 శాతం పెరుగుదలను హీరో మోటోకార్ప్ నమోదు చేసింది.
హీరో స్కూటీల కంటే ఎక్కువ మోటార్ సైకిళ్లను విక్రయించింది. అక్టోబర్‌లో హీరో 6,35,787 యూనిట్ల బైక్‌లను విక్రయించగా, స్కూటీలు 43,304 మాత్రమే అమ్ముడయ్యాయి. హీరో బైక్స్‌లో స్ప్లెండర్ ఎక్కువగా అమ్ముడుపోయింది. హీరో స్ప్లెండర్ చవకైన వేరియంట్ స్ప్లెండర్ ప్లస్. దీని ఎక్స్ షోరూం ధర రూ. 76,356 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ లీటరు పెట్రోల్‌కు 80.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్ ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి. ఈ బైక్‌లో ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సీ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్ 8,000 ఆర్పీఎం వద్ద 5.9 కేడబ్ల్యూ పవర్‌ని, 6,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.8 లీటర్లుగా ఉంది. హీరో బైక్స్ ధరలు తక్కువగా, అందుబాటులో ఉండటం వల్లనే దేశంలోనే నంబర్ వన్ టూ వీలర్ బ్రాండ్‌గా హీరో నిలిచింది.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!