Hero Karizma XMR: హీరో మోటోకార్ప్ తన కరిజ్మా ఎక్స్ఎంఆర్ యూనిట్లను డెలివరీలకు సిద్ధం చేస్తుంది. మొదటి యూనిట్ జైపూర్ లొకేషన్ నుంచి బయటకు రానుంది. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించిన డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వినియోగదారులు రూ.3000 కట్టి దీన్ని బుక్ చేసుకోవచ్చు. 


ఇందులో 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో దీన్ని లాంచ్ చేశారు.  ఈ బైక్ 25.5 బీహెచ్‌పీ పవర్, 20.4 ఎన్ఎం టార్క్‌ని అందించగలదు.


బైక్ డిజైన్ చూడటానికి ఎల్ఈడీ హెడ్‌లైట్ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ లాగా కనిపిస్తుంది. ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్, స్ట్రాంగ్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఇతర ఫీచర్లతో రానుంది.


ధర ఎంత?
కొత్త హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. తర్వాత దీని ధర రూ.1.82 లక్షలకు పెరగనుందని తెలుస్తోంది. ఈ బైక్ యమహా ఆర్15 వీ4, బజాజ్ పల్సర్ ఆర్ఎస్200, సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250, కేటీయం ఆర్సీ 200 వంటి మోడళ్లతో పోటీపడగలదు.


కలర్ ఆప్షన్లు ఎలా ఉన్నాయి?
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ మూడు రంగులలో అందుబాటులో ఉంది. ఇందులో మాట్ బ్లాక్, రెడ్, ఎల్లో మోడల్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో చాలా ఫీచర్లు ఉన్న మొదటి బైక్ ఇదే. ఇందులో అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్సీడీ డాష్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి. బైక్‌లో లేయర్డ్ డిజైన్‌తో ఫెయిరింగ్, డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, అప్‌స్వెప్ట్, షార్ప్ డిజైన్‌తో కూడిన టెయిల్ సెక్షన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial