Ducati Launch 14 New Motorcycles In 2025: 2025 సంవత్సరం ఆటో పరిశ్రమకు అనేక కొత్త మోడళ్లను తీసుకువచ్చింది. ఈ సంవత్సరం అనేక బైక్‌లు, కార్లు విడుదల కానున్నాయి. అదే సమయంలో ఇటాలియన్ కంపెనీ డుకాటీ ఈ సంవత్సరం భారత మార్కెట్లో ఒకటి లేదా రెండు కాదు 14 మోటార్‌సైకిళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి నెలా డుకాటీ కొత్త మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. కొత్త మోడళ్ల విడుదలతో పాటు బైక్ కంపెనీ తన డీలర్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించబోతోంది.
డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ, డుకాటీ సూపర్‌స్పోర్ట్ బైక్ పానిగేల్ వీ4... 2025 మొదటి మూడు నెలల్లో లాంచ్ కానున్నాయి. పానిగేల్ వీ2 ఫైనల్ ఎడిషన్, స్క్రాంబ్లర్ డార్క్ తర్వాతి మూడు నెలల్లో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ నాలుగు బైక్‌లు మొదటి ఆరు నెలల్లో మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఐదు బైక్‌లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ బైక్‌ల జాబితాలో సరికొత్త 890 సిసి మల్టీస్ట్రాడా V2, స్క్రాంబ్లర్ రిజోమా ఉన్నాయి. దీంతో పాటు స్ట్రీట్‌ఫైటర్ వీ4, స్ట్రీట్‌ఫైటర్ వీ2, పానిగేల్ వీ2 కూడా మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. డిసెంబర్ 2025లో డుకాటి మార్కెట్లోకి అనేక కొత్త బైక్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కొత్త బైక్‌ల గురించి మరిన్ని వివరాలు వెల్లడి అవుతాయి.
భారత మార్కెట్లో కంపెనీ అమ్మకాలను పెంచడానికి డుకాటి ఈ సంవత్సరం తన డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించబోతోంది. ప్రస్తుతం డుకాటి షోరూమ్‌లు మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డుకాటి డీలర్ నెట్‌వర్క్ గురించి చెప్పాలంటే కంపెనీ షోరూమ్‌లు ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, చండీగఢ్, అహ్మదాబాద్‌లలో ఉన్నాయి. కొత్త బైక్‌లను ప్రారంభించడంతో పాటు డుకాటి ఇప్పుడు భారతదేశంలో షోరూమ్‌ల సంఖ్యను పెంచబోతోంది. కాబట్టి ఇకపై డుకాటి కూడా మార్కెట్లో తన మార్కును చూపించనుందన్న మాట.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?