Indian Automobile Histroyలో కొన్ని కార్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ Cars వేర్వేరు కారణాలతో Marketలోకి రాలేకపోయాయి. అసలు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఆ తొలి తరం కార్లు అంతరించిపోవటానికి కారణాలేంటో చూద్దాం
హాల్ పింగ్లే(Pingle car)-1950
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే రక్షణ శాఖ కోసం ఇండీజినిస్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, ఎయిర్ క్రాఫ్టు ఇంజిన్లు, బోయింగ్ తో టై అప్ అయిన స్వదేశీ విమానాల తయారీ సంస్థే అనుకుంటారు చాలా మంది. కానీ 1950లో HAL నుంచి ఓ కారును సిద్ధం చేశారని మీకు తెలుసా. ఎస్ HALకు జనరల్ మేనేజర్‌గా పని చేసిన పింగ్లే మధుసూదన్ రెడ్డి... డెబ్భై ఏళ్ల క్రితం మూడు ప్రోటో టైప్ కార్లు సిద్ధం చేయించారు. ఆయన పేరు మీదుగానే వాటికి హాల్‌పింగ్లే అనే పేరు పెట్టారు.
4వేల 600 రూపాయల ధరతో ఈ 7హెచ్‌పీ 2 స్ట్రోక్ ఇంజిన్ కారును తయారు చేయించిన పింగ్లే మధుసూదన్ రెడ్డి మొత్తం ఇలాంటివి ఏడువేల కార్లు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రచించారు. కానీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను తిరస్కరించటంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. 1970 వరకూ HAL బెంగుళూరు పరిసరాల్లో, హైదరాబాద్ నుమాయిష్‌లోనూ కనపిస్తూ సందడి చేసేది హాల్ పింగ్లే కారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఈ కారు మాయమైంది. కారణాలు తెలియదు కానీ అప్పటి నుంచి పింగ్లే కుటుంబం సైతం ఈ కారు ఆనవాళ్ల కోసం వెతికింది లేదు. ఆఖరకు యాభై ఏళ్ల తర్వాత హైదరాబాద్ స్క్రాప్ యార్డ్‌లో పూర్తిగా పాడైపోయిన స్థితిలో కనిపించింది పింగ్లే కారు. అప్పటి ప్రధాని నెహ్రూ ప్రశంసలు అందుకున్న కారు... ఇలా దీనస్థితిలో కనిపించటం దురదృష్టకరమైన అసలు లేదు పోయిందనుకున్న కారు కనిపించటం ఓ రకంగా ఆనందమే.
Meera Car- మీరా కారు- 1949
టాటా నానో రిలీజ్ అయినప్పుడు దేశంలో మొట్టమొదటి మినీ కారు అదే అనుకున్నారు అంతా. కానీ కాదు దేశంలో తొలి చిన్నకారు మీరా. మీరా ఆటోమొబైల్స్ అధినేత శంకర్ కులకర్ణి పన్నెండు వేల రూపాయల ఖర్చుతో దీన్ని రూపొందించారు. నలుగురు కూర్చుకునేందుకు వీలుండే ఈ కారు 19 హార్స్ పవర్ ఇంజిన్ తో లీటరు పెట్రోల్‌కు 19-20 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేలా రూపొందించారు. కానీ అప్పట్లో ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవటం, భరించలేని ఎక్సైజ్ డ్యూటీస్‌తో ఆ సంస్థ పూర్తిగా దెబ్బతింది. మీరా కారు మార్కెట్‌లోకి రాకుండానే కనుమరుగైపోయింది.
Bajaj PTV 1980
మనకందరికీ బజాజ్ క్యూట్ తెలుసు కదా. 1980లో ఆటోరిక్షా బిజినెస్‌లో బజాజే మేజర్ ప్లేయర్. ఎప్పుడైతే నాటి కేంద్ర ప్రభుత్వం ఆటోలపై ఆంక్షలు విధించటం మొదలు పెట్టిందో అప్పుడు దాని నుంచి బయటపడేందుకు బజాజ్ ఓ సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఆటోకే కొంచెం రీమోడల్ చేసి హ్యాండిల్ బార్ ప్లేస్‌లో స్టీరింగ్ పెట్టి బ్యాక్ సైడ్ ర్యాక్ ఇచ్చి బజాజ్ పీటీవీ అని రిలీజ్ చేసింది. నలుగురు కూర్చుగలిగే కెపాసిటీతో విడుదలైన పర్సనల్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ లీటరకు 26 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చేలా రూపొందించారు. కానీ ఎందుకో తెలియదు ఇవి మార్కెట్లో పెద్దగా విడుదల కాలేదు. ఆ తరువాత కనుమరుగైపోయాయి.
సిఫానీ డాల్ఫిన్ 1982
ఈ లిస్ట్‌లో అసలు ప్రొడక్షన్ స్టేజ్‌కి కూడా వెళ్లని కార్ ఇదే. కానీ అంతకు ముందే ర్యాలీ రేస్‌లో పాల్గొనటం ద్వారా మంచి పేరు సంపాదించింది. ఫైబర్ గ్లాస్‌తో తయారైన ఈ కార్ వెయిట్ రేషియో పోల్చుకుంటే అద్భుతమైన కార్. దీనికి మొదట్లో లెమన్ కార్ అని పేరు పెడదాం అనుకున్నారంట. కొన్ని లోపాలు గుర్తించడంతో ఓవరాల్‌గా కార్ సేఫ్టీ మీదే అనుమానాలు మొదలయ్యాయి. మారుతి 800 ఈలోపు మార్కెట్ లో లాంచ్ అవటంతో..రేసుల్లో సందడి చేసిన ఈ కారు ఇండియన్ మార్కెట్లో కనిపించలేదు ఆ తర్వాత.
అరవింద్ బేబీ మోడల్ 3- 1966
ట్రావెన్ కోర్ మహారాజు వీపీ థంపీ, కేఏ బాలకృష్ణన్ మీనన్‌ను తన ఆస్థానంలో నియమించుకున్న తర్వాత ఓ కారును తయారు చేయాలని కోరారు. అప్పుడు అరవింద్ బేబీ మోడల్ 3 ను తయారు చేయించారు. వాస్తవానికి భారత్‌లో ఓ చిన్న గ్యారేజ్‌లో తయారైన మొట్టమొదటి కారు ఇదేనని చెప్పుకోవచ్చు. దీన్నేం ఇంజినీర్లు తీర్చిదిద్దలేదు. కేఏ బాలకృష్ణన్ మీనన్ సూచనలు ఇస్తే కొంత మంది కంసాలులు తయారు చేశారంట. భారత ప్రభుత్వం నుంచి ఈ కారు తయారీకి మద్దతు లభించకపోవటంతో భారత ఆటోమొబైల్ హిస్టరీకి ఓ చిహ్నంలా మిగిలిపోయింది అరవింద్ బేబీ మోడల్. ఇప్పుడు మళ్లీ అరవింద్‌ను తయారు చేసేందుకు కేరళ గవర్నమెంట్ సహకారంతో కొన్ని స్టార్టప్ లు కృషి చేస్తున్నాయి.