Shah Rukh Khan Deepika Padukone Hyundai India: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, నటి దీపికా పదుకొణె జంటగా చాలా చిత్రాలలో నటించారు. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెని కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకుంది. దీంతో ఈ జోడీ ఇప్పుడు ఆటో రంగంలోకి కూడా అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ ఈ దక్షిణ కొరియా బ్రాండ్‌తో 25 సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నారు.


ఎక్స్‌టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా
అయితే ఈ బ్లాక్‌బస్టర్ ద్వయం కాకుండా హ్యుందాయ్ కొంతకాలం క్రితం వెటరన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను కొత్తగా ప్రారంభించిన మైక్రో ఎస్‌యూవీ హ్యుందాయ్ ఎక్స్‌టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం యువతలో నటి దీపికా పదుకొణెకి ఉన్న క్రేజ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారు. తద్వారా కంపెనీ దీపిక బ్రాండ్ వాల్యూ నుంచి ప్రయోజనం పొందుతుంది. షారుక్, దీపికాల జంటను అధునాతన సాంకేతికత, ప్రజాదరణల కలయికగా చూస్తోంది.


2023 నవంబర్‌లో హ్యుందాయ్ విక్రయించిన వాహనాల గురించి చెప్పాలంటే... దేశీయ మార్కెట్లో మొత్తంగా 49,451 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2022లో విక్రయించిన 48,002 యూనిట్ల కంటే ఇది 3.01 శాతం ఎక్కువ. ఇంకా హ్యుందాయ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల దేశీయ అమ్మకాలను దాటడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించడానికి సిద్ధంగా ఉంది. ఇది భారతీయ మార్కెట్‌లో కంపెనీకి ఒక ప్రధాన మైలురాయి అవుతుంది.


హ్యుందాయ్‌కి భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్. వాటా పరంగా యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. 2023లో హ్యుందాయ్ గ్లోబల్ సేల్స్‌లో భారత మార్కెట్ 18.6 శాతం వాటాను అందిస్తుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!