2024 Upcoming Smartphones: 2024 జనవరి మొదటి వారంలోనే ఐదు ఫోన్లు - అన్ని ధరల ఆప్షన్లలోనూ - రెడ్‌మీ, వివో సూపర్ ప్లాన్!

Upcoming Smartphones in January 2024: 2024 ప్రారంభంలో కొన్ని మంచి స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ కానున్నాయి.

Continues below advertisement

Upcoming Mobiles January 2024: 2023 సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కొత్త సంవత్సరం మొదటి నెలలో అంటే 2024 జనవరిలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కాబోతున్నాయి. బడ్జెట్, మిడ్, ఫ్లాగ్‌షిప్ నుంచి ప్రీమియం వరకు ప్రతి కేటగిరీలో ఏదో ఒక ఫోన్ లాంచ్ కానుంది. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే 2024 మొదటి నెలలో మీ కోసం అనేక ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి మొదటి వారంలోనే ఐదు స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి.

Continues below advertisement

జనవరి మొదటి వారంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు కంపెనీలు తమ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను జనవరిలో విడుదల చేయనున్నాయి. ఇందులో రెడ్‌మీ, వివో ఉన్నాయి. జనవరి 4వ తేదీన రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ను విడుదల చేస్తుంది. ఇందులో రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్‌తో సహా మూడు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. వివో అదే రోజున వివో ఎక్స్100 సిరీస్‌ను కూడా లాంచ్ చేస్తుంది. దీని కింద వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఉండనున్నాయి. ఈ రెండు సిరీస్‌లకు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. మీరు కంపెనీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆన్‌లైన్‌లో వీటి లాంచ్ ఈవెంట్‌ను చూడగలరు.

రెడ్‌మీ నోట్ 13 సిరీస్ స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ మూడు ఫోన్‌ల్లోనూ 6.67 అంగుళాల 1.5కే ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను చూడవచ్చు. రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడల్‌లో మీరు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. దీనిలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో మోడల్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్లను ఉండనున్నాయి. బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ అందించనున్నారు.

వివో ఎక్స్100 సిరీస్ ఫీచర్లు
ఈ వివో సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో లాంచ్ కానుంది. వివో ఎక్స్100 బేస్ మోడల్‌లో కంపెనీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ప్రో మోడల్‌లో కంపెనీ 100W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనుంది.

వివో ఎక్స్100 సిరీస్ ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. టెక్‌అవుట్‌లుక్ కథనం ప్రకారం వివో ఎక్స్100 ధర మనదేశ మార్కెట్లో రూ.63,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్. వివో ఎక్స్100 ప్రో ధర రూ.89,999 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Continues below advertisement