Citroen C3 Aircross: సిట్రోయెన్ తన సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని యూరోపియన్ మార్కెట్లో కూడా లాంచ్ చేయనుంది. అయితే అక్కడ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ఇటీవలే లాంచ్ చేసిన యూరో స్పెక్ ఈసీ3 హ్యాచ్‌బ్యాక్ తరహాలో కేవలం ఈవీగా మాత్రమే సేల్ కానుంది. ఈసీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుంది.


యూరప్ కోసం లాంచ్ కానున్న ఈసీ3 ఎయిర్‌క్రాస్ (eC3 Aircross) 7 సీటర్ మోడల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది రెండో తరం మోడల్‌గా యూరోప్‌కు రానుంది. ఇది చిన్న ఈసీ3 హ్యాచ్‌బ్యాక్‌తో పాటు అడ్జస్టబుల్ సీసీ21 ప్లాట్‌ఫారమ్‌పై రూపొందనుంది. కానీ మూడు వరుసల సీటింగ్ లేఅవుట్ (2+3+2 లేఅవుట్) కోసం సీట్ల సర్దుబాటు ఉంటుంది. దీని పొడవు ఎక్కువగా ఉంటుంది.


కంపెనీ సీఈవో థియరీ కోస్కాస్ కొత్త మోడల్ ప్రివ్యూ చిత్రాలను కూడా షేర్ చేశారు. కొత్త ఈసీ3 ఆవిష్కరణ వేడుక ముగింపులో సిట్రోయెన్ యూకే ప్రతినిధి అది కొత్త ఎయిర్‌క్రాస్ అని ధృవీకరించారు. ఈ మోడల్ ఈవీ మోడల్‌గా యూరప్‌లో మాత్రమే లాంచ్ కానుంది. అయితే దీని పవర్‌ట్రెయిన్ గురించిన సమాచారం ఇంకా ప్రకటించలేదు. అయితే భవిష్యత్తులో ఇది ఐసీఈ మోడల్ రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంది.


బ్యాటరీ ప్యాక్, ఎంత రేంజ్?
ఈసీ3 ఎయిర్‌క్రాస్ కూడా ఈసీ3 హ్యాచ్‌బ్యాక్ మాదిరి గానే బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అంటే ఇది అధికారికంగా 44 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుందని అర్థం చేసుకోవచ్చన్న మాట. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. 200 కిలోమీటర్ల రేంజ్ ఉన్న చవకైన మోడల్ కూడా 2025లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది చిన్న బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.


భారతదేశం కోసం సిట్రోయెన్ eC3 ఎయిర్‌క్రాస్
పెట్రోల్‌తో నడిచే సీ3 ఎయిర్‌క్రాస్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఉంది. అయితే ఈసీ3 ఎయిర్‌క్రాస్ వచ్చే ఏడాది భారతదేశంలో అమ్మకానికి రానుంది. భారతదేశానికి వచ్చే మోడల్ యూరప్ స్పెక్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది.


సిట్రోయెన్ దాని eC3 మోడల్‌తో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ భారతీయ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక ఈవీ కారు ఇదే. ఈ కారు కస్టమర్లలో బాగా మంచి పేరు పొందింది. అయితే కంపెనీ మాత్రం ఈ ఒక్క కారుతోనే సంతృప్తి చెందలేదు. సిట్రోయెన్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారులో టాప్ స్పెక్ ట్రిమ్‌ను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఈ మోడల్‌కు "షైన్" అని పేరు పెట్టారు. ఇందులో మరింత అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం లభించనుందని కారు తెలిపింది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial