భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమకు చెందిన మూడు ఆటోమోటివ్ దిగ్గజాలు - మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్... త్వరలో కొన్ని సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాయి. కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన దశను సూచిస్తూ టాటా మోటార్స్ ఈ ఏడాది చివర్లో పంచ్ ఈవీని విడుదల చేయడానికి ఇప్పటికే సిద్ధంగా ఉంది.


మరోవైపు హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీని కూడా పరీక్షిస్తోంది. ఇది దాని ఈవీ లైనప్‌లో చవకైన ఎలక్ట్రిక్ కారు కావచ్చు. మారుతి సుజుకి ఈ సంవత్సరం ప్రారంభంలో రాబోయే ఎలక్ట్రిక్ కార్ల టీజర్‌ను విడుదల చేసింది. వీటిలో ఎలక్ట్రిక్ వెర్షన్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైక్రో ఎస్‌యూవీ అందరి దృష్టిని ఆకర్షించింది.


టాటా పంచ్ ఈవీ
టాటా పంచ్ ఈవీ 2023 పండుగ సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది టాటా జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో మార్కెట్లోకి రానుంది. ఇందులో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ, పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. టియాగో ఈవీ పవర్‌ట్రెయిన్‌ను పంచ్ ఈవీలో చూడవచ్చు. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 74 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్‌తో 19.2 కేడబ్ల్యూహెచ్ యూనిట్, 61 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్‌తో 24 కేడబ్ల్యూహెచ్ యూనిట్ ఇందులో చూడవచ్చు. దాని ఐసీఈ మోడల్ మాదిరిగానే ఎలక్ట్రిక్ పంచ్ కొత్త 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొన్ని ఇతర ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నారు.


హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ కూడా టెస్టింగ్ ప్రారంభ దశలో ఉంది. ఇది 2024లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇది నేరుగా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో టాటా పంచ్ ఈవీతో పోటీ పడనుంది. ఎక్స్‌టర్ ఈవీ 25 కేడబ్ల్యూహెచ్ నుంచి 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 నుంచి 350 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీలో కొన్ని కాస్మెటిక్ మార్పులను హ్యుందాయ్ అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఇంటీరియర్ లేఅవుట్, స్పెసిఫికేషన్‌లు ఐసీఈ ఎక్స్‌టర్‌ని పోలి ఉంటాయి.


మారుతీ ఫ్రంట్ఎక్స్ ఈవీ
మారుతి సుజుకి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించింది. మొదటి మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఈవీ 2025 ప్రారంభంలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. వాగర్ఆర్ ఈవీ, బలెనో ఈవీ వంటి మోడళ్లను టీజ్ చేసింది. ఫ్రంట్ఎక్స్ ఈవీ, గ్రాండ్ విటారా ఈవీ, జిమ్నీ ఈవీ కనిపించాయి. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారీ మార్కెట్ వాటాను సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.


Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial