Global NCAP Safety Ratings: కొత్త గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్ అమల్లోకి వచ్చి ఒక సంవత్సరం దాటింది. ఈ కొత్త ప్రోటోకాల్ ప్రకారం ఈఎస్‌సీ, పాదచారుల రక్షణ, సైడ్ ఇంపాక్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ విషయాల్లో గ్లోబల్ ఎన్‌సీఏపీ కోసం అవసరమైన స్కోర్‌ను సాధిస్తేనే వాహనం 5-స్టార్ రేటింగ్‌ను పొందుతుంది. ప్రస్తుతానికి కొత్త ప్రోటోకాల్ కింద కేవలం 10 భారతీయ నిర్మిత కార్లు మాత్రమే పరీక్షించారు. ఈ కార్లు ఏవి, వాటి ర్యాంకింగ్ ఏమిటో చూద్దాం.
మారుతీ సుజుకి ఇగ్నిస్
కొత్త ప్రమాణాల ప్రకారం, మారుతి ఇగ్నిస్ టెస్టింగ్‌లో కేవలం సింగిల్ స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. పెద్దల భద్రత కోసం గరిష్టంగా 34 పాయింట్లలో 16.48 సాధించింది. సైడ్ ఇంపాక్ట్ టెస్టింగ్‌లో మొత్తం 17 పాయింట్లకు 6.91 పొందింది. దీనికి ఈఎస్సీ లేదు. అలాగే యూఎన్127 లేదా జీటీఆర్9 పాదచారుల భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేదు. ఇది పిల్లల భద్రత కోసం 0 స్టార్ రేటింగ్‌ను పొందింది.
మారుతీ సుజుకి స్విఫ్ట్
మారుతీ స్విఫ్ట్ పెద్దల భద్రత కోసం 34 పాయింట్లకు 19.19, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 49 పాయింట్లకు 16.68 పాయింట్లు సాధించింది. సైడ్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఇది 17కి 12.9 స్కోర్ చేసింది. మొత్తంగా దీనికి కూడా సింగిల్ స్టార్ రేటింగ్ వచ్చింది.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ ప్రయాణీకుల భద్రత కోసం గరిష్టంగా 34 పాయింట్లకు గానూ 19.69 పాయింట్లు (1 స్టార్) స్కోర్ చేసింది. అయితే పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు కేవలం 3.40 పాయింట్లు మాత్రమే (0 స్టార్) సాధించింది. కారు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లను పొందలేదు. అలాగే పాదచారుల భద్రతా నిబంధనలను కూడా అందుకోలేదు.
మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో
మారుతి ఎస్ ప్రెస్సో కూడా గరిష్టంగా 34 పాయింట్లకు 20.03 స్కోర్‌ను పొందగలిగింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం కేవలం 1 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే పొందింది. పిల్లల భద్రత కోసం గరిష్టంగా 49 పాయింట్లకు గాను కేవలం 3.52 పాయింట్లు (జీరో స్టార్) మాత్రమే సాధించింది.
మారుతీ సుజుకి ఆల్టో కే10
మారుతి ఆల్టో కే10 అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌ల్లో 34 పాయింట్లకు 21.67 స్కోర్ చేసింది. దీనికి గానూ రెండు స్టార్ల రేటింగ్‌ను పొందింది. సైడ్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 17 పాయింట్లకు 12.4 పాయింట్లు రాగా, పిల్లల రక్షణ పరంగా 49 పాయింట్లకు కేవలం 3.52 (0 స్టార్) మాత్రమే వచ్చింది.
మహీంద్రా స్కార్పియో ఎన్
మహీంద్రా యొక్క స్కార్పియో ఎన్ ఎస్‌యూవీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు 29.25 స్కోర్ చేసి ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో స్కార్పియో ఎన్ 17 పాయింట్లకు 16 స్కోర్‌ను సాధించింది. అలాగే పిల్లల భద్రత కోసం ఈ ఎస్‌యూవీ 49 పాయింట్లకు గానూ 28.93 పాయింట్లను, మూడు స్టార్ల రేటింగ్‌ను పొందింది.
వోక్స్‌వ్యాగన్ టైగన్/స్కోడా కుషాక్
ఒకే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించినందున, వోక్స్‌వ్యాగన్, స్కోడా నుంచి ఈ రెండు ఎస్‌యూవీలు ఒకే స్కోర్‌ను సాధించాయి. ఈ రెండు కార్లు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందాయి. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు 29.64 స్కోర్ సాధించింది. పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో కూడా 49 పాయింట్లకు 42 పాయింట్లు వచ్చాయి. ఇది ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించింది.
వోక్స్‌వ్యాగన్ వర్టుస్/స్కోడా స్లావియా
వోక్స్‌వ్యాగన్ వర్టుస్, స్కోడా స్లావియా కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను పొందాయి. ఈ రెండు సెడాన్‌లు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు 29.71 పాయింట్లు, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 17 పాయింట్లకు 14.2 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 42 పాయింట్లు సాధించాయి.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial