Car Sales Report September 2025: సెప్టెంబర్ 2025లో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మారుతి సుజుకీ మరోసారి నంబర్ వన్ పొజిషన్‌ చేజిక్కించుకోగా, టాటా మోటార్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో రెండో స్థానానికి ఎగబాకింది. టాటా స్పీడ్‌కు మహీంద్రా మూడో స్థానానికి పడిపోయింది. హ్యుందాయ్ కూడా పెద్ద ఎదురు దెబ్బ తిన్నది.


Maruti Suzuki - ఎప్పటి లాగే నంబర్ వన్
దేశంలో అగ్రశ్రేణి కార్ల కంపెనీ అయిన మారుతి సుజుకీ, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,22,785 యూనిట్ల (Maruti Suzuki Car Sales Report September 2025) సేల్స్‌ రిజిస్టర్‌ చేసింది. ఆగస్టులో 1,30,242 యూనిట్లు అమ్మినప్పటికీ, సెప్టెంబర్‌లో 5.77% తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు, MPVలు అన్నింటిలోనూ మారుతి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.


Tata Motors - రెండో స్థానానికి రైజింగ్‌
టాటా మోటార్స్ సెప్టెంబర్‌లో 40,068 యూనిట్ల రిజిస్ట్రేషన్లు (Tata Motors Car Sales Report September 2025) సాధించింది. ఇది, ఆగస్టులోని 37,988 యూనిట్లతో పోలిస్తే 5.44% పెరుగుదల. Nexon, Punch పంచ్ మోడళ్లకు భారీ డిమాండ్ ఉండటం వల్ల టాటా ఈ సక్సెస్ సాధించింది. ఈ సేల్స్‌తో, Mahindra ను దాటుకుని రెండో స్థానంలోకి వచ్చింది.


Mahindra & Mahindra - ఊహించని క్షీణత
మహీంద్రా సెప్టెంబర్‌లో 37,451 యూనిట్లకు (Mahindra Car Sales Report September 2025) పడిపోయింది. ఆగస్టులో 42,253 యూనిట్లు అమ్మిన కంపెనీకి ఇది 11.37% తగ్గుదల. SUVలపై ఆధారపడే మహీంద్రా లాజిస్టిక్ సమస్యలు, సప్లై డిస్టర్బెన్స్ కారణంగా రివర్స్‌ గేర్‌ వేసింది.


Hyundai - పెద్ద షాక్
హ్యుందాయ్ ఇండియా సెప్టెంబర్‌లో 35,470 (Hyundai Car Sales Report September 2025) యూనిట్లకు తగ్గింది. ఆగస్టులో 45,686 యూనిట్లు అమ్మిన కంపెనీకి ఇది 22.34% డౌన్‌ఫాల్‌. SUVలు Creta, Venue ఉన్నప్పటికీ వాల్యూమ్ తగ్గడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.


Toyota - ఆశించిన వృద్ధి రాలేదు
Innova Hycross, Fortuner కి డిమాండ్ ఉన్నప్పటికీ టయోటా సెప్టెంబర్‌లో 20,051 యూనిట్ల ‍(Toyota Car Sales Report September 2025) వద్ద ఆగిపోయింది. ఆగస్టులో 26,453 యూనిట్లను రిజిస్టర్‌ చేసిన కంపెనీకి ఇది 24.23% తగ్గుదల.


Kia - ఒక మోస్తరు క్షీణత
2025 సెప్టెంబర్‌లో కియా ఇండియా సేల్స్‌ కూడా 16,540 యూనిట్లకు పడిపోయాయి. ఆగస్టులో 18,793 యూనిట్లు ఉన్నప్పటికీ సెప్టెంబర్‌లో తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి.


వాహన్‌ డేటా ప్రకారం సెప్టెంబర్ 2025లో కార్ల విక్రయాల్లో టాప్ 3 పొజిషన్‌ల్లో పెద్ద మార్పు జరిగింది. మారుతి సుజుకీ లీడర్‌గా నిలవగా, టాటా మోటార్స్ రెండో స్థానంలోకి రావడం ఆటో మార్కెట్‌లో హైలైట్ అయింది. మహీంద్రా, హ్యుందాయ్, టయోటా, కియా మాత్రం వెనక్కి వెళ్లిన కంపెనీలుగా నిలిచాయి. ఓవరాల్‌గా చూస్తే, యువతలో SUVలపై ఆసక్తి పెరుగుతోంది. మారుతి సుజుకీ - టాటా మోటార్స్‌ మధ్య పోటీ రాబోయే నెలల్లో మరింత ఆసక్తికరంగా మారబోతోంది.