Brahmamudi Serial Today Episode: తనను హాస్పిటల్ లో డాక్టర్ కలవని విషయం కళ్యాన్‌కు ఎలా తెలిసిందని కావ్య అనుమానిస్తుంది. అదే విషయం కళ్యాణ్‌ను అడుగుతుంది కావ్య.
కావ్య: నేను డాక్టర్‌ను కలవలేదని అంత కచ్చితంగా ఎలా చెప్పారు.. అంటే నన్ను ఫాలో అవుతున్నావా..?
కళ్యాణ్: నేను అలా ఎందుకు చేస్తాను వదిన అయినా నేను నాన్నమ్మ ఆయిల్ కోసం అంత దూరం వెళ్లిన నేను నిన్ను ఎలా ఫాలో చేస్తాను
కావ్య: మరి నేను డాక్టర్‌ను కలవలేదన్న విషయం మీకెలా తెలుసు
కళ్యాణ్: గెస్ చేశాను వదిన హాస్పిటల్‌కు వెళితే చాలా టైం పడుతుంది కదా.. మీరేమో త్వరగా వచ్చారు అందుకే గెస్ చేశాను.. నాకు అర్జెంట్ వర్క్ ఉంది వస్తాను వదిన
కళ్యాణ్ వెళ్లిపోతాడు. కానీ కావ్య మాత్రం కళ్యాణ్‌ను అనుమానిస్తుంది. రాజ్ ఆయిల్ కోసం కళ్యాణ్‌ను ఎందుకు పంపారు. రాజ్ దాస్తున్న నిజం ఏంటో కళ్యాణ్‌కు కచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే కళ్యాణ్‌ను గట్టిగా అడగాలని డిసైడ్ అవుతుంది. కళ్యాణ్ రూంలోకి వెళ్తుంది.
కళ్యాణ్: ఏంటి వదిన అలా సడెన్‌గా వచ్చేశావు
కావ్య: అవసరం పడింది
కళ్యాణ్: అప్పుతోనా వదిన
కావ్య: కాదు నీతోనే
కళ్యాణ్: ఏం చెప్పాలి వదిన
కావ్య: నిజం చెప్పాలి..
కళ్యాణ్: ఏం నిజం వదిన
కావ్య: మీరు నా దగ్గర దాచిన నిజం.. ఇంకా దాస్తున్న నిజం.
కళ్యాణ్: నేను నీ దగ్గర నిజాలు దాయడం ఏంటి వదిన అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు వదిన
కావ్య: ఇంకా ఎందుకు కవిగారు దాస్తారు. అమ్మ దగ్గర అబద్దం ఆడినంత మాత్రాన నిజం దాగదు కదా కవిగారు. మీరు చెప్పకపోయినా నాకు నిజం ఏంటో తెలిసిపోయింది. మీ అన్నయ్య మీరు కలిసి ఆడుతున్న డ్రామా గురించి తెలుసుకోలేని పిచ్చిదాన్ని అనుకున్నారా.? చెప్పండి కవి గారు ఇంత పెద్ద నిజాన్ని నాకు చెప్పకుండా ఎందుకు దాచారు.. చెప్పండి కవిగారు ఎందుకు దాచారు.. మీ మౌనం నాకు సమాధానం కాదు కవిగారు.. చెప్పండి ఎందుకు దాచారు
కళ్యాణ్: అంటే వదిప అది మీకు ముందే చెప్పాలనుకున్నాం కానీ అన్నయ్యే చెప్పొద్దు అన్నారు.
కావ్య: ఆయన చెప్పొద్దు అంటే మీరు ఆగిపోతారా..? ఎప్పుడూ తల్లి కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటారు కదా..? ఈ విషయం చెప్పడానికి ఏమైంది కవిగారు
కళ్యాణ్: నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని చెప్పలేదు వదిన అసలు ఏం జరిగింది అంటే… మేము టెస్ట్ రిపోర్టులు తెద్దామని హాస్పిటల్‌కు వెళ్తుంటే..
అప్పుడే రాజ్ వచ్చి డోర్ దగ్గర నుంచి చెపొద్దు అంటూ సైగ చేస్తాడు. దీంతో కళ్యాణ్ నిజం చెప్పకుండా ఏదో కహాని చెప్తాడు. ఇంతలో రాజ్ రావడంతో కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత దేవుడి దగ్గరకు వెళ్లిన కావ్య ఏడుస్తూ దేవుడి ముందు నిలబడి బాధపడుతుంది. తర్వాత అపర్ణ రాజ్‌ను పిలిచి ఇంటి పరువు మొత్తం తీస్తున్నావని తిడుతుంది. సుభాష్ వాళ్ల ఫ్రెండ్ వచ్చి రాజ్, కావ్యకు అబార్షన్ చేయించాలని చూస్తున్నాడట కదా అని అడుగుతున్నాడని ఇంట్లో విషయాలు బయటకు ఎలా పొక్కాయి అంటూ నిలదీస్తుంది. ఇంతలో రుద్రాణి కలగజేసుకుని గొడవ పెద్దది చేయాలని చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!