BYD Atto 2 Launch: చైనీస్ కార్ల తయారీ సంస్థ బీవైడీ (Build Your Dreams) దేశీయ మార్కెట్లో కొత్త చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీవైడీ ఆట్టో 2ని లాంచ్ చేయనుంది. ఈ చిన్న ఈ-ఎస్‌యూవీ గత సంవత్సరం చివరిలో లాంచ్ కావడానికి ముందు చైనీస్ హోమోలోగేషన్ ఫైలింగ్‌లో కనిపించింది. ఆట్టో 2 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గ్లోబల్ మార్కెట్‌లో జీప్ అవెంజర్, హ్యుందాయ్ కోనా ఈవీలతో పోటీపడనుంది. బీవైడీ ఆట్టో  2 చైనాలో యువాన్ అప్ పేరుతో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఎందుకంటే ఆట్టో 3కి అక్కడ యువాన్ ప్లస్ అని పేరు పెట్టారు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో, కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీవైడీ కొత్త మూడో తరం ఈ-ప్లాట్‌ఫాం 3.0 ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కంపెనీ లైనప్‌లో డాల్ఫిన్ హ్యాచ్‌బ్యాక్, ఆట్టో 3 క్రాస్‌ఓవర్ మధ్య ఉండనుంది.


వేటితో పోటీ?
చైనాతో పాటు బీవైడీ ఆట్టో 2 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2025 నాటికి యూరోపియన్ మార్కెట్‌ల్లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎడమ, కుడి చేతి డ్రైవ్ మోడ్‌లలో లాంచ్ అయింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆటో మార్కెట్‌లో కూడా కంపెనీ తనదైన ముద్ర వేస్తోంది. బీవైడీ ఆట్టో 2ని భారత మార్కెట్లో కూడా త్వరలో ప్రవేశపెట్టవచ్చు. ఈ విభాగంలో మారుతి సుజుకి ఈవీఎక్స్, హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ వంటి ఐదు కొత్త ఎలక్ట్రిక్ SUVలు దేశంలోకి రానున్నాయి.


ఇంజిన్ ఎలా ఉండనుంది?
లీకైన సమాచారం ప్రకారం కొత్త బీవైడీ ఆట్టో 2 పొడవు 4310 మిల్లీమీటర్లుగానూ, వెడల్పు 1830 మిల్లీమీటర్లుగానూ, ఎత్తు 1675 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఇది ఆట్టో 3 కంటే దాదాపు 140 మిల్లీమీటర్లు చిన్నది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదికలో అట్టో 2 కూడా బీవైడీ డాల్ఫిన్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే 94 బీహెచ్‌పీ లేదా 174 బీహెచ్‌పీతో ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును పొందుతుందని తెలుస్తోంది.


సింగిల్ ఛార్జ్‌తో ఎంత దూరం?
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చైనీస్ కార్ల కంపెనీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్లేడ్ బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది. ఇది 32 కేడబ్ల్యూహెచ్ లేదా 45.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందవచ్చు. వీటిలో మొదటిది 300 కిలోమీటర్లు, రెండో వేరియంట్ 400 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వగలవు. ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ స్పెసిఫికేషన్ల ఆధారంగా, కొత్త బీవైడీ మోడల్ బరువు 1430 కిలోల నుంచి 1540 కిలోల వరకు ఉండవచ్చు.


మరోవైపు హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇటీవల రూ. 11 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ పెట్రోల్, ఆటోమేటిక్ వేరియంట్‌లకు చాలా డిమాండ్ ఉందని హ్యుందాయ్ తెలిపింది. ఈ కారుకు సంబంధించి మొత్తం బుకింగ్‌లో వరుసగా 55 శాతం వీటికే ఉన్నాయి. మిగతా ఆర్డర్లలో 45 శాతం డీజిల్ వేరియంట్‌లకు సంబంధించినవి కావడం విశేషం.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!