Supreme Court of India Clerk Notification: న్యూఢిల్లీలోని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు లా డిగ్రీతోపాటు రిసెర్చ్‌/ అనలిటికల్‌ స్కిల్స్‌, రాత సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జనవరి 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 15న అర్దరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.


రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 10న రాతపరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో విశాఖపట్నంలోని పరీక్ష కేంద్రాల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీన మార్చి 11న విడుదల చేస్తారు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే ఆన్‌లైన్ ద్వారా తెలపాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.80,000 జీతంగా చెల్లిస్తారు.


వివరాలు..


* లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్ 


ఖాళీల సంఖ్య: 90 పోస్టులు


అర్హతలు: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రిసెర్చ్‌/ అనలిటికల్‌ స్కిల్స్‌, రాత సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ చేసినవారు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. 


వయోపరిమితి:  15.02.2024 నాటికి 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.500.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. 


ఎంపిక విధానం: పార్ట్‌-1  రాతపరీక్ష (మల్టీపుల్ ఛాయిస్ తరహా), పార్ట్-2 రాత పరీక్ష (సబ్జెక్టివ్ రిటన్ రాతపరీక్ష), పార్ట్-3 ఇంటర్వ్యూ ఆధారంగా.


జీతం: రూ.80,000.


పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, ఇంఫాల్, జోధ్‌పూర్, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, పాట్నా, పుణే, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం, విశాఖపట్నం.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.01.2024. 


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 15.02.2024. (24:00 Hours)


➥ రాత పరీక్షతేది: 10.03.2024.


➥ రాత పరీక్ష ఆన్సర్ కీ: 11.03.2024.


Notification


Online Application


Website


ALSO READ:


ఎన్‌సీఈఆర్టీలో 170 ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు, వివరాలు ఇలా
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్టీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 1 నుంచి ఫిభ్రవరి 3 వరకు ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...