BMW CE 02 Electric Scooter: బీఎండబ్ల్యూ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బీఎండబ్ల్యూ సీఈ 02ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన దేశీయ భాగస్వామి కంపెనీ టీవీఎస్ సహకారంతో ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌తో విడుదల చేసిన ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.5 లక్షలుగా ఉంది.
బీఎండబ్ల్యూ తీసుకొచ్చిన ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో స్కూటర్, బైక్ రెండింటికి అవసరమైన పవర్‌ని ఇవ్వబోతోంది. ఈ స్కూటర్‌లో మీరు ఫ్లాట్ సీటును పొందుతారు. ఇందులో స్టైలిష్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం స్కూటర్ ముందు భాగంలో ప్రీమియం భాగాల కోసం యూఎస్‌డీ ఫోర్కులు ఉపయోగించారు.
డిజైన్ గురించి చెప్పాలంటే ఇది మార్కెట్లో లభించే ఇతర మోడళ్ల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఫ్లాట్ సీటుతో పాటు దాని వెడల్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్కూటర్‌పై ఇద్దరు వ్యక్తులు హాయిగా కూర్చోవచ్చు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో...
మీరు ఈ స్కూటర్‌లో రెండు బ్యాటరీ ఆప్షన్లను పొందుతారు. దీని కారణంగా ఈ స్కూటర్ ఎక్కువ రేంజ్‌ను అందించనుంది. ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. మరో 1.96 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ అందుబాటులో ఉండటంతో ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. గరిష్ట వేగం గురించి చెప్పాలంటే ఇది గంటకు 96 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 0.9 కేడబ్ల్యూ ఛార్జర్ సహాయంతో ఐదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌ను లాంచ్ చేయడానికి ముందే కంపెనీ దాని గురించి సమాచారాన్ని అందించే టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బీఎండబ్ల్యూ సీఈ 02 స్టాండర్డ్ మోడల్‌లో ఎల్ఈడీ లైటింగ్, యూఎస్‌బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, 2 రైడ్ మోడ్ ఫ్లో ఉన్నాయి. ఇది కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛానల్ ఏబీఎస్, స్టెబిలిటీ కంట్రోల్‌ను పొందుతుంది. ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో రివర్స్ మోడ్, కీలెస్ ఆపరేషన్, యాంటీ థెఫ్ట్ అలారం, 3.5 అంగుళాల మైక్రో టీఎఫ్‌టీ కూడా ఉన్నాయి.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?