Bharat NCAP Crash Test Rating: టాటా మోటార్స్ లాంచ్ చేసిన రెండు ఈవీలు ఇండియా ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌లను సాధించాయి. నెక్సాన్ ఈవీ, ఇటీవల లాంచ్ అయిన పంచ్ ఈవీ రెండూ బీఎన్‌సీఏపీ (BNCAP) టెస్టింగ్‌లో మొదటి ఈవీలు కావడం ద్వారా టాప్ మార్కులు సాధించాయి. పంచ్ ఈవీ పెద్దల ఆక్యుపెన్సీకి 32కి 31.46, పిల్లల ఆక్యుపెన్సీ క్రాష్ టెస్ట్‌లో 49కి 45 స్కోర్ చేసింది.


పంచ్ ఈవీ అనేది బీఎన్‌సీఏపీ నుంచి అత్యధిక రేటింగ్ పొందిన కారు. నెక్సాన్ ఈవీతో సహా ఇతర టాటా మోటార్స్ కార్ల కంటే ఎక్కువ మార్కులను స్కోర్ చేసింది. ఈ అతి చిన్న ఎలక్ట్రిక్ టాటా ఎస్‌యూవీ కొత్త యాక్టివ్ ఈవీ ఆర్కిటెక్చర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా పొందుతుంది. అలాగే త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఈఎస్సీ, ఐసోఫిక్స్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.


Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?


నెక్సాన్ ఈవీ స్కోర్ ఎలా ఉంది?
టాటా నెక్సాన్ ఈవీ గురించి చెప్పాలంటే ఇది 5 స్టార్ రేటింగ్‌ను కూడా పొందింది. అయితే ఇది పంచ్ ఈవీ కంటే కొంచెం తక్కువ మార్కులను పొందింది. నెక్సాన్ ఈవీ పెద్దల భద్రత కోసం 32 పాయింట్లకు 29.86, పిల్లల భద్రత కోసం 23.95 పాయింట్లను టాటా నెక్సాన్ ఈవీ స్కోర్ చేసింది.


ఇటీవల భారత్ ఎన్‌సీఏపీ తాజా ప్రోటోకాల్ ఆధారంగా గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్టును కూడా అధిగమించింది. అందువల్ల కారు మూడు స్టార్లు స్కోర్లు చేయడానికి, అది తప్పనిసరిగా ఈఎస్సీని కలిగి ఉండాలి. పంచ్ ఈవీ అనేది కొత్త నిర్మాణాన్ని పరిచయం చేసిన టాటా మొదటి ఈవీ, ఇది కంపెనీ ఫ్రాంక్స్, భవిష్యత్తు మోడల్స్ వంటి లక్షణాల కోసం ఉపయోగిస్తారు. 


పంచ్ ఈవీ ఎలా ఉంది?
పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ 315 కిలోమీటర్లు, 35 కేడబ్ల్యూహెచ్ 421 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్ వెర్షన్లలో వస్తుంది. ఈ రెండు ఈవీలు బీఎన్‌సీఏపీలో టెస్ట్ చేసిన మొదటి కార్లు. అయితే ఇతర బ్రాండ్‌లు కూడా ఈ పరీక్ష కోసం తమ కార్లను పంపుతున్నందున భవిష్యత్తులో మరిన్ని కార్లు ఈ టెస్టింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.






Also Read: మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ కారు లాంచ్ త్వరలో - ఏఆర్ రెహమాన్ సౌండ్ డిజైన్‌తో!