Best Sports Bike in Affordable Price: యువతలో స్పోర్ట్స్ బైక్‌లకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు సాధారణ బైక్‌లకు బదులు అపాచీ, పల్సర్ వంటి బైక్‌లకు యువత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. ఈ బైక్‌ల శక్తివంతమైన ఇంజన్, స్పోర్టీ లుక్ ప్రజలను ఆకర్షించడమే దీని వెనుక పెద్ద కారణం. దీంతో పాటు ఈ బైక్‌లు రోజువారీ వినియోగానికి కూడా బెస్ట్‌గా ఉంటాయి.


స్పోర్ట్స్ బైక్ ధర చాలా ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు మంచి స్పోర్ట్స్ బైక్‌ను రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల మధ్య కొనుగోలు చేసేయవచ్చు. ఈ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్పోర్టీ లుక్, పవర్ ఫుల్ ఇంజిన్ ఉన్న బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ (TVS Apache RTR 160 4V)
మొదటి స్పోర్ట్స్ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ. ఈ టీవీఎస్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.26 లక్షలుగా ఉంది. ఇది 160 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్ 17.4 బీహెచ్‌పీ పవర్‌ని, 14.73 పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో సెగ్మెంట్ ఫస్ట్ రామ్ ఎయిర్ కూలింగ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే వేడి దాదాపు 10 డిగ్రీల వరకు తగ్గుతుంది. ఆయిల్ కూలింగ్‌తో ఈ బైక్ ఎఫ్ఐ వేరియంట్‌లో గంటకు 114 కిలోమీటర్ల గరిష్ట వేగం, కార్బ్ వేరియంట్‌ గంటకు 113 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 (Bajaj Pulsar NS160)
ఈ లిస్ట్‌లో రెండో బెస్ట్ ఆప్షన్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160. దీని ప్రారంభ ధర రూ. 1.24 లక్షలుగా ఉంది. ఈ బైక్‌లో 160 సీసీ ట్విన్ స్పార్క్ ఇంజిన్ ఉంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 నేరుగాటీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Extreme 160R 4V), యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ3.0 (Yamaha FZ-S Fi V3.0), సుజుకి జిక్సర్ (Suzuki Gixxer)తో పోటీపడుతుంది. ఈ బైక్‌లోని సింగిల్ సిలిండర్ ఇంజన్ 17 బీహెచ్‌పీ పవర్, 14.6 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4 (Yamaha FZ-S FI V4)
ఈ లిస్ట్‌లో ఉన్న మూడో బెస్ట్ ఆప్షన్ పెద్ద ఆప్షన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.28 లక్షలుగా ఉంది. ఈ మోటార్‌సైకిల్ ఫీచర్లలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఉన్నాయి. ముందు వెనుక డిస్క్ బ్రేక్, మల్టీ ఫంక్షనల్ ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టైర్ హగ్గింగ్ రియర్ మడ్‌గార్డ్, లోయర్ ఇంజన్ గార్డ్, బ్లూటూత్ ఎనేబుల్డ్ వై-కనెక్ట్ యాప్‌ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?