2024 Best Selling Smartphone: యాపిల్ ఐఫోన్ మరోసారి ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా అవతరించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాలు అత్యధికంగా నమోదయ్యాయి. ఇందులో ఐఫోన్ 15 ఎక్కువగా అమ్ముడుపోతుంది. దీని ఫీచర్లు, సెక్యూరిటీ కారణంగా ప్రజలు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఐఫోన్ 15 తర్వాత అత్యధికంగా అమ్ముడైన మోడల్స్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 ప్రో. యాపిల్ ఓవరాల్ సేల్స్ తగ్గినప్పటికీ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఖరీదైనవి కావడం వల్ల కంపెనీకి మరింత ఆదాయాన్ని ఇస్తున్నాయి.


లిస్ట్‌లో శాంసంగ్ కూడా...
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లలో ఐదు ఫోన్లు శాంసంగ్‌వే ఉన్నాయి. టాప్ 10లో యాపిల్‌వి నాలుగు మోడల్స్, షావోమీకి ఒక మోడల్ ఉంది. శాంసంగ్ అమ్మకాలు  చాలా పెరిగాయి. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ వాటా దాదాపు 19 శాతంగా ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్‌కు జనాదరణ 2018 నుంచి ప్రారంభం అయింది. ఈ ఆదరణ పెరగడం కారణంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరింది. 2024 మూడో త్రైమాసికంలో టాప్ 10 మోడల్స్ ప్రపంచ విక్రయాల్లో 19 శాతం వాటాను కలిగి ఉన్నాయి.



Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!


షావోమీ ఫోన్ కూడా
గత సంవత్సరం షావోమీ రెడ్‌మీ 12సీ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్‌ల్లో ఉంది. దాని తర్వాతి వెర్షన్ రెడ్‌మీ 13సీ ఈ సంవత్సరం బెస్ట్ సెల్లింగ్ ఫోన్లలో టాప్ 10 లిస్ట్‌లో చేరింది. తక్కువ ధర, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మంచి పట్టు కారణంగా దీని ప్రజాదరణ చెక్కు చెదరకుండా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు మనదేశంలో మంచి ఆదరణ ఉంది.


ఖరీదైన ఫోన్లకు కూడా డిమాండ్
టాప్ 10 లిస్ట్‌లో ఉన్న చాలా ఫోన్లు వాటి ప్రీమియం లుక్, అద్భుతమైన ఫీచర్ల కారణంగా ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే యాపిల్ ఫోన్లు చాలా ఖరీదైనవి. అదే సమయంలో షావోమీ, శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్లు యాపిల్ కంటే చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.



Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?