Best Cars Under 5 Lakh in India: మనదేశంలో చాలా మంది తమ సొంత కారును కలిగి ఉండాలని కలలు కంటారు. కానీ ఎక్కువ బడ్జెట్ లేని కారణంగా, చాలా మంది కారును కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈరోజు మనం రూ.ఐదు లక్షలలోపు బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.


రెనో క్విడ్ (Renault Kwid)
రెనో లాంచ్ చేసిన ఈ ఎంట్రీ లెవల్ కారులో 799 సీసీ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇవి వరుసగా 54 హెచ్‌పీ పవర్, 68 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఫైవ్ సీటర్ కారు. ఇది మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది 270 లీటర్ల బూట్ స్పేస్‌తో దాదాపు అన్ని బేసిక్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.70 లక్షలుగా ఉంది.


మారుతీ ఆల్టో 800 (Maruti Alto 800)
మారుతి ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షలతో మొదలై రూ. 5.13 లక్షల వరకు ఉంది. ఈ కారు మార్కెట్లో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 799 సీసీ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది.


మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10)
మారుతి ఆల్టో కే10లో 998 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. దీంతో సీఎన్‌జీ కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఆల్టో కే10 మైలేజ్ వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి 24.39 కిలోమీటర్ల నుంచి 33.85 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.99 లక్షలుగా ఉంది.


మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
మారుతి ఎస్ ప్రెస్సో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక సీఎన్‌జీ కిట్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిని కలిగి ఉంటుంది. వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో 24.12 కిలోమీటర్ల నుంచి 32.73 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.64 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


మారుతి ఈకో (Maruti Eeco)
మారుతి ఈకో భారతీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర రూ. ఐదు లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. దీని బేస్ మోడల్ ఎస్‌టీడీ ఫైవ్ సీటర్ ధర రూ. 5.25 లక్షలు అయితే, టాప్ మోడల్ ఏసీ సీఎన్‌జీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.51 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్ షోరూం ధరలు. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 79.6 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఏడు సీట్ల ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!