శీతాకాలం వచ్చేసింది. ఈ కాలం వచ్చింది అంటే చాలు చలిపులి విజృంభిస్తుంది. అంతేకాదు సూర్యరశ్మి కూడా తగ్గిపోతుంది. ఈ కారణంగా చాలా మందిలో విటమిన్-డి లోపం తలెత్తుతుంది. అయితే చలికాలంలో కాసేపు ఎండలో కూర్చోమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అయితే ఎండతో పాటు, మీ ఆహారంలో విటమిన్-D అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చమని నిపుణులు సూచిస్తున్నారు.
మన ఎముకలు, దంతాలు, కండరాల ఆరోగ్యానికి విటమిన్-డి చాలా ముఖ్యమైన పోషకం. అంతేకాకుండా, ఇది శరీరంలో కాల్షియం, ఫాస్ఫేట్ ఎముకలకు సరిగ్గా చేరడానికి విటమిన్-D ఉపయోగపడుతుంది. విటమిన్-D మన ఎముకలను బలపరుస్తుంది. Vitamin-D లోపం ఉంటే ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంది. చివరకు అది ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధికి దారితీస్తుంది. అయితే నిజానికి విటమిన్-D కావాలంటే మనశరీరానికి అతిపెద్ద మూలం సూర్య కిరణాలు, కాబట్టి దీనిని సూర్యకాంతిలో మన శరీరం ఎక్స్ పోజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది, కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కాలంలో విటమిన్-D లోపం సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, విటమిన్-D ఎలా పొందాలో తెలుసుకుందాం.
చలి కారణంగా మనం బయట తిరిగేందుకు అంత ఆసక్తి చూపించము. కానీ ఇది చెడ్డ అలవాటు. రోజూ ఆరు బయట కాసేపు ఎండలో కూర్చోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, మీరు రోజూ 8 నుంచి 15 నిమిషాల పాటు సూర్యరశ్మిని తీసుకోవడం ద్వారా తగినంత విటమిన్-D పొందవచ్చు.
విటమిన్-D అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి:
సూర్యరశ్మిని తీసుకోవడమే కాకుండా, మీరు మీ ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ఆహారం శరీరానికి అన్ని పోషకాలను అందిస్తుంది, సూర్యరశ్మి విటమిన్-D ఉత్తమ మూలం. అయినప్పటికీ, ప్రతిరోజూ తినే కొన్ని ఆహారాలు కూడా వాటి స్థాయిలను పెంచుతాయి. మీరు మీ ఆహారంలో ఈ ఆహారాలను చేర్చవచ్చు: నారింజ, గుడ్లు. పుట్టగొడుగు. ట్యూనా చేప. సాల్మన్ చేప. పాశ్చరైజ్డ్ పాలు. ధాన్యంలో విటమిన్-D లభిస్తుంది.
విటమిన్-D లోపం లక్షణాలు ఏమిటి?
శరీరంలో విటమిన్-D లోపం ఉన్నప్పుడు, మీరు ఈ క్రింది లక్షణాలు మీలో కనబడవచ్చు:
- శరీరం బలహీనంగా ఉంటుంది.
- రాత్రి పడుకున్నాక కూడా అలసటగా అనిపిస్తుంది.
- ఎముకలు, కీళ్ళలో నొప్పి.
- కండరాల బలహీనత, నొప్పి లేదా కండరాల తిమ్మిరి
- డిప్రెషన్ వంటి మూడ్ మార్పులు
విటమిన్-D సప్లిమెంట్లను ఎప్పుడు తీసుకోవాలి?
మీరు తగినంత సూర్యకాంతి పొందలేనప్పుడు, లేదా మీ ఆహారంలో తగినంత విటమిన్-D పొందకపోతే, మీరు విటమిన్-D సప్లిమెంట్లను తీసుకోవలసి రావచ్చు. అయితే విటమిన్-D సప్లిమెంట్లను తీసుకునే ముందు, మీ వైద్యుడిని సంప్రదించండి.
Read Also : ఉప్పు లేదా చక్కెర - వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.