Best Cars Under Rs 7.5 Lakh: భారతదేశంలో బడ్జెట్ కార్లకు ఎంతో డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్ల కంపెనీలు కూడా బడ్జెట్ కార్లలో ఎన్నో ఫీచర్లను యాడ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో పాటు ఫ్యామిలీస్ కోసం ఎక్కువ స్పేస్‌ను అందిస్తున్నాయి. రోజువారీ పనులకు కూడా ఇది సరిపోతుంది. ప్రస్తుతం మనదేశంలో రూ.7.5 లక్షల్లోపు ధరలో సూపర్ హిట్ అయిన టాప్-5 కార్లు ఇవే.


1. టాటా పంచ్ (Tata Punch)
మనదేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో టాటా పంచ్ కూడా ఒకటి. ఈ కారు చూడటానికి కొంచెం చిన్నగా ఉంటుంది. కానీ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువగా ఉండనుంది. దీని కారణంగా ఇది ప్రాక్టికల్ వాహనం కానుంది. 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ వేరియంట్‌తో ఇది పెయిర్ కానుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో దాదాపు అన్ని ఫీచర్లూ ఉన్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ టెస్టులో కూడా మంచి స్కోరును సాధించింది. టాటా పంచ్‌లో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న డ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీ ద్వారా బూట్ స్పేస్ మరింత లభించనుంది.


2. హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
హ్యుందాయ్ ఎక్స్‌టర్... టాటా పంచ్‌కు డైరెక్ట్‌గా పోటీ ఇవ్వనుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆధారంగా ఎక్స్‌టర్‌ను రూపొందించారు. ఈ కారులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీతో ఇది పెయిర్ అయింది. ఎక్స్‌టర్‌లో చాలా ఫీచర్లు అందించారు. ఇందులో సన్‌రూఫ్, డ్యాష్ క్యామ్, యాంబియంట్ లైటింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ఎక్స్ షోరూం ధర రూ.6.12 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఎక్స్‌టర్‌లో సీఎన్‌జీ ఆప్షన్ కూడా లాంచ్ అయింది.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


3. మారుతి సుజుకి వాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R)
మారుతి సుజుకి వాగన్ ఆర్ మనదేశంలో ఉన్న మోస్ట్ పాపులర్ కార్లలో ఒకటి. దీని పొడవైన డిజైన్‌ను అందరూ ఇష్టపడతారు. ఈ కారులో 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్, 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్లు అందించారు. టాప్ వేరియంట్లలో 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ వేరియంట్ అందుబాటులో ఉంది. మారుతి వాగన్ ఆర్ ఎక్స్ షోరూం ధర రూ.5.55 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ కారు మంది మైలేజీని కూడా అందిస్తుంది.


4. టాటా టియాగో (Tata Tiago)
టాటా టియాగో అనేది ఒక బ్రిలియంట్ వెహికిల్. ఇందులో ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మంచి సేఫ్టీ స్కోరును కూడా అందుకుంది. 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ కారులో చూడవచ్చు. 5 స్సీడ్ మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్ షోరూం ధర రూ.5.59 లక్షలుగా ఉంది. టాటా డ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీతో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఈ కారులో అందించారు. ఇది బూట్ స్పేస్‌ను బాగా ఆక్రమిస్తుంది.


5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 NIOS)
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అనేది సిటీలో తిరగడానికి చాలా మంచి కారు అని చెప్పవచ్చు. ఇందులో రోజువారీ ఉపయోగానికి అవసరమైన చాలా ఫీఛర్లు అందించారు. హ్యుందాయ్ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ను కంపల్సరీగా అందిస్తున్నారు. ఇది మంచి కంఫర్టబుల్ కారు కూడా. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్స్ అందించారు. మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్ షోరూం ధర రూ.5.84 లక్షలుగా ఉంది. ఈ కారు సీఎన్‌జీలో కూడా అందుబాటులో ఉంది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే